అవినాష్ రెడ్డిని జగన్‌ ఎందుకు కాపాడుతున్నారు?టిడిపి ప్రశ్న

Bonda Uma Maheswara Raoవివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కాకుండా మరెవరైనా చిక్కుకొని ఉండి ఉంటే సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇలాగే వారిని వెనకేసుకువస్తూ అండగా నిలబడి ఉండేదా?అంటే సమాధానం అందరికీ తెలుసు.

కనుక అవినాష్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం ఇంతగా ఎందుకు వెనకేసుకువస్తోంది?అనే ప్రశ్నకు సీబీఐ, న్యాయస్థానం ఏమి సమాధానం కనుగొంటాయో తెలీదు కానీ వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా అవినాష్ రెడ్డిని కాపాడుకొనేందుకు ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డుకొంటున్నారని సుప్రీంకోర్టుకి తెలియజేశారు.

ADVERTISEMENT

ఇక టిడిపి నేతలు మొదటి నుంచి ఈ కేసులో సిఎం జగన్మోహన్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా నిన్న ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “వివేకా వలన తనకు రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని అవినాష్ రెడ్డి భావిస్తే, వివేకా ఉంటే తల్లికి, చెల్లికి ఆస్తులు పంచాలని ఒత్తిడి చేస్తారని జగన్‌ భావించారు. అందుకే వివేకాను అడ్డుతొలగించుకొన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి నోరు విప్పితే జగన్‌ కూడా ఈ కేసులో చిక్కుకొంటారు. అందుకే అవినాష్ రెడ్డిని భద్రంగా కాపాడుకొంటున్నారు,” అని అన్నారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబందించి ముఖ్యమైన అంశాలను బోండా ఉమా ప్రస్తావించి సమాధానాలు చెప్పాలని సిఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్‌ చేశారు.

· జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ముఖ్యమంత్రి కాగానే ఆ పిటిషన్‌ ఉపసంహరించుకొని సిట్‌తో కధ నడిపించారు. ఎందుకు?

· మొదట గుండెపోటు అన్నారు. గుండెపోటు వస్తే హాస్పిటల్‌కు తీసుకువెళ్లి ఎందుకు బ్యాండేజీలు చుట్టించారు?ఎవరు కట్టించారు?

· గుండెపోటు కాస్త గంట వ్యవధిలో గొడ్డలి వేటు ఎలా అయ్యింది?

· సునీతారెడ్డి వచ్చే వరకు ఆగకుండా హడావుడిగా ఎందుకు పోస్టుమార్టం చేయించారు?

· సొంత పత్రికలో చనిపోయిన వివేకాకు అక్రమ సంబంధాలు అంటగడుతూ ఎందుకు కధనాలు ప్రచురిస్తున్నారు?

· వివేకా హత్యపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?అని బోండా ఉమా ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories