ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర భిందువు విజయవాడ రాజకీయాలు. అయితే ఈ బెజవాడ రాజకీయాలు రాష్ట్రంలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే సాగుతాయి. గతంలో రెండు కుటుంబాల మధ్య సాగే ఈ రాజకీయ వర్గ పోరు ఇప్పుడు రెండు పార్టీల మధ్య రగులుతుంది.
తాజాగా బోండా ఉమా వివాదం మరోసారి బెజవాడ రాజకీయాలను చర్చలోకి తెచ్చాయి. ముద్రగడ సంతాప సభకు హాజరైనా బోండా ఆ వేదిక మీద వైసీపీ నేతలతో కలిసి కనిపించారు, దానికి తోడు అదేసమయంలో టీడీపీ పార్టీ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
దీనితో పార్టీ అధిష్టానం బోండా ను వివరణ కోరగా అందులోకి వైసీపీ కాపు నేతలు ఎంట్రీ ఇచ్చారు. బోండా చేసినతప్పేమిటి.? ముద్రగడ సంతాప సభ కు ఒక కాపు నేతగా బోండా రావడం టీడీపీ కి ఇంత కష్టమా.? బాబు దీన్ని కూడా ఒక రాజకీయ వివాదం చెయ్యాలా.? అంటూ వైసీపీ కాపు నేత అంబటి రాంబాబు ఉమకు మద్దతుగా ముందుకొచ్చారు.
ఇక ఇదేబాటలో మరో వైసీపీ కాపు నేత పేర్ని నాని కూడా బోండా కోసం తన గళం విప్పారు. మెగా డిఎస్సి పేరుతో నారాలోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, లోకేష్ మంత్రిత్వ శాఖలో పేపర్ లీకేజ్ జరిగిందని, లోకేష్ కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాదిరి తన మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని,
ఆ పదవిని కాపు నేత బోండా ఉమకు అప్పగించాలంటూ బోండా తరుపున సిఫారస్ తీసుకున్నారు పేర్ని నాని. అయితే వైసీపీ గతకొంతకాలంగా రాష్ట్రంలో కాపు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు సాయికృష్ణ వివాదాన్ని సైతం వదలకుండా కుల రాజకీయాలు నడిపింది.
ఇక ఇప్పుడు బోండా కేంద్రంగా వైసీపీ కాపు నాయకులు చేస్తున్న రాజకీయాలు గమనిస్తే వైసీపీ కాపు రాజకీయాలు పార్ట్ – 2 మొదలుపెట్టిందా.? అన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే ఇక్కడ వైసీపీ మద్దతు పొందిన బోండా జగన్ 2.0 మిషన్ ఆకర్ష లో భాగంగా వైసీపీ జెండా భుజానకెత్తుకుంటే ఇటు టీడీపీ లో ఆ సీటు కోసం వంగవీటి రాధా కాసుకొని కూర్చున్నారు.
కాబట్టి ఒకవేళ వైసీపీ కాపు కుల రాజకీయాలు పార్ట్ – 2 అంటూ బోండా ను తెరమీదకు తెస్తే అందుకు కౌంటర్ గా టీడీపీ వంగవీటి వారసుడిని తెరముందు కు తెచ్చే అవకాశం ఉంది. దీనితో వైసీపీ కాపు రాజకీయాలకు టీడీపీ రాధతో చెక్ పెట్టె అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
గతంలో కూడా ఇదే మాదిరి టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి వంశీని టీడీపీ ప్రత్యర్థిగా మార్చింది, బాబు కుటుంబానికి రాజకీయ శత్రువుగా నిలబెట్టింది. వైసీపీ లో ఎంట్రీ కోసం జగన్ ఆశీస్సులు కోసం రాజకీయ విలువలకు చితిపెట్టి మరి వంశీ టీడీపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు.
దాని ఫలితంగా వైసీపీ లో వంశీ కి దక్కిన గౌరవం మాజీ టీడీపీ ఎమ్మెల్యే అని, జగన్ దగ్గర దొరికిన ప్రశంస ‘అందగాడు’ అని. ఉన్నదాన్ని వదులుకుని వైసీపీ ట్రాప్ లో పడి లేనిదాని కోసం ఆరాటపడిన వంశీ చివరికి రాజకీయ కేసులతో కటకటాలు లెక్కించే స్థాయికి పతనమయ్యారు, తన రాజకీయ జీవితాన్ని చేచేతుల దిగజార్చుకున్నారు.
ఏదిఏమైనా బోండా లేని మంత్రి పదవి కోసం ఉన్న పార్టీని, ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైసీపీ ట్రాప్ లో చిక్కుకుంటే రేపటి రోజున బోండా ఉమా కూడా మరొక వల్లభనేని వంశీగా మారాల్సి ఉంటుందేమో బహుశా..!



