ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో చిరకాలం కలిసి పని చేసిన ఉద్యోగుల మద్య అనుబందం ఏర్పడటం, ఒకరు వెళ్ళిపోతుంటే మిగిలినవారు బాధ పడటం సహజమే.
కానీ రాజకీయ పార్టీలలో నాయకుల మద్య అటువంటి అనుబంధం ఏర్పడటం కష్టమే. కారణం.. వారి మద్య టికెట్లు, పదవులు, అధికారం కోసం ఎల్లప్పుడూ పోటీ నెలకొని ఉండటమే.
అందువల్లే ఓ నాయకుడు లేదా ప్రజా ప్రతినిథి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే బాధపడే బదులు వెంటనే పరస్పరం కత్తులు దూసుకుంటుంటారు.
అయితే మేనల్లుడు చిన్న శ్రీను టీడీపిలోకి వెళ్ళిపోయినందుకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురవుతున్నారు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాలలో పదేపదే కంట తడిపెడుతున్నారు. నేడు మరోసారి కంట తడి పెట్టారు.
అయితే “చిన్న శ్రీను పార్టీ వీడి వెళ్ళిపోతాడని నాకు 8 నెలల ముందే తెలుసు. అందుకే నా కుమార్తెను రాజకీయ వారసురాలుగా తెచ్చానని,” బొత్స సత్యనారాయణ ఇటీవలే ఓ సమావేశంలో చెప్పారు.
“చిన్న శ్రీను వెళ్ళిపోయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు నా కుమార్తె అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని,” ఆయనే కార్యకర్తలకు చెప్పారు.
చిన్న శ్రీను గురించి 8 నెలల ముందే తెలుసన్నప్పుడు ఆయనతో బొత్స సత్యనారాయణ మాట్లాడి పార్టీ మారవద్దని వారించారా?కనీసం ఈ విషయం జగన్ చెవిలో వేశారా?
ఒకవేళ వారించి ఉండి ఉంటే, తాను వారించినా వెళ్ళిపోయాడని కన్నీళ్ళు పెట్టుకున్నా అర్థం ఉంటుంది. లేదా జగన్ చెవిలో వేసినా ఇద్దరూ పట్టించుకోలేదని చెప్పుకొని బాధపడినా అర్థం ఉంటుంది.
కానీ చిన్న శ్రీను ఇంకా జెడ్పీ చైర్మన్ పదవిలో ఉండగానే, ఈసారి ఆ పదవి తన కూతురిదని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇది మేనల్లుడు చిన్న శ్రీనుని అవమానించడం కాదా?అలా అవమానించి ఇప్పుడు అయన వెళ్ళిపోయాడని పదేపదే కన్నీళ్ళు పెట్టుకోవడం దేనికి?జిల్లాలో తన కుటుంబానికి అతను అడ్డు తొలగిపోయాడని సంతోషించాలి కానీ బాధపడటం దేనికి?
మరోసారి Emotional అయిన Botsa Satyanarayana!
చిన్న శ్రీను పార్టీ మార్పుపై Gudivada Amarnath
మాట్లాడుతుండగా బొత్స Emotional.#BotsaSatyanarayana @gudivadaamar pic.twitter.com/w1y0Ou35fP— M9 NEWS (@M9News_) September 12, 2026





