బోయపాటి వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేసిన పోసాని!

posani-boyapati-srinuఅతి తక్కువ కాలంలో 100 సినిమాలకు కధలను అందించి టాప్ తెలుగు సినీ రచయితగా కొనసాగిన పోసాని కృష్ణ మురళీ పేరు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ప్రస్తుతం హిట్ దర్శకులుగా కొనసాగుతున్న త్రివిక్రమ్, బోయపాటి, సంపత్ నంది, కళ్యాణ్ కృష్ణ తదితరులంతా పోసానికి అసిస్టెంట్ లుగా చేసిన వారే. అయితే తన వద్ద పని చేసిన వారందరిలో ఒక్క బోయపాటి శ్రీను మినహా, మిగతా వారంతా తనతో సత్సంబంధాలు కలిగిన వారేనని… తాజాగా ఇచ్చిన ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పోసాని.

ADVERTISEMENT

నా దగ్గర 30 మంది దాకా పని చేసారు, అందరూ నాతో గౌరవంగా ఉంటారు, ఒక్కడు తప్ప… అంటూ మొదలుపెట్టి బోయపాటి వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు పోసాని. “నేను ఎవరైతే ఇండస్ట్రీకి తీసుకువచ్చానో, ఎవర్నైతే నేను ఇక్కడ పరిచయం చేసానో, ఎవరైతే పేదోడు అని చెప్పానో… వాడు బోయపాటి శ్రీను. ఎవరి మీద వ్యక్తిగత కక్ష్యలు పెంచుకోను నేను, ఏదైనా ఉంటే అనేసి పక్కకు వెళ్ళిపోతాను… అయితే బోయపాటి శ్రీను అనే వ్యక్తి మీద ఎందుకు ఈ టాపిక్ తీసుకువచ్చానో చెప్తాను… అంటూ సవివరంగా తెలిపారు పోసాని.

బోయపాటి శ్రీను అనే వాడు చాలా చాలా చాలా పేదవాడు. ఒక చిన్న పూరీల్లు మాత్రమే ఉండేది. వాళ్ళ నాన్న ఒక ముస్లిం దర్గా దగ్గర వాచ్ మెన్ గా పని చేస్తూ 250 రూపాయలు వచ్చేది, దాని మీద బ్రతకాలి వీళ్ళంతా. వాళ్ళన్నయ్యకు ‘బోయపాటి బ్రహ్మయ్య’ అనే చిన్న ఫోటో స్టూడియో ఉండేది, తినడానికి సరిపోయే డబ్బులు మాత్రమే వస్తాయి. అతను నా దగ్గరకు వచ్చి… ‘అన్నా… తినటానికి కూడా జరగట్లేదు… కాస్త మా తమ్ముడు పైకొస్తే హెల్ప్ గా ఉంటుంది’ అనే చెప్తే… వెంటనే పిలిపించమని చెప్తే అక్కడకు వచ్చిన బోయపాటి శ్రీను తనతో ఎలా ఉండేవాడో తన హావభావాలతో చేసి చూపించారు పోసాని.

రెండు చేతులు గట్టిగా ముడుచుకుని తల దగ్గరకు పెట్టి… అన్నాయ్ అని ఉండేవాడని… ఆయనను తీసుకువెళ్ళి ముత్యాల సుబ్బయ్య దగ్గరకు తీసుకువెళ్లి… నాకు తమ్ముడు అవుతాడు… అసిస్టెంట్ గా పెట్టుకోమంటే… అప్పటికే నా దగ్గర రెండు గ్రూప్ లు ఉన్నాయి… ఖాళీలు లేవు… అంటే, నేను మీకు 7 సినిమాలు చేశాను, 6 వంద రోజులు ఆడాయి, నా ముఖం చూసి పెట్టండి అంటే… ఏమయ్యా నువ్వు ఇట్లాంటివి భలే చెప్తావ్ అని ముత్యాల సుబ్బయ్య ఓకే అని పిలిపించమంటే…. అప్పటికీ కూడా మరో విజ్ఞప్తి చేసానని చెప్పుకొచ్చారు పోసాని.

ఒక సినిమా అయిపోగానే వదిలిపెట్టవద్దు… పదేళ్ళ పాటు మీ దగ్గర ఉంచుకోండి, వాడు డైరెక్టర్ అయ్యే దాకా చూడండి అని దండం పెట్టి నా వ్యక్తిగత విజ్ఞప్తిగా చెప్తే… ముత్యాల సుబ్బయ్య పదేళ్ళ పాటు పోషించారని చెప్పారు. నేను డైరెక్టర్ గా మారి ‘శ్రావణమాసం’ అనే సినిమా తీస్తే అది దారుణ పరాజయం అయ్యింది. అప్పుడు వాడు నేను ఇంట్లో లేని సమయంలో వచ్చి… ‘వదినా… నేనంటే సినిమా డైరక్షన్ డిపార్టుమెంటులో ఉన్నాం, అన్నయ్య లేడు కదా అందుకే సినిమా పోయింది… అయ్యో రేపట్నుంచి ఇన్సురన్సు కట్టాలన్నా, డ్రైవర్ జీతాలు ఇవ్వాలన్నా, ఎలా కట్టగలుగుతారు’ అన్నాడండి బోయపాటి శ్రీను. అయితే నా భార్య మంచి విద్యావంతురాలు కాబట్టి బాధపడలేదు, కన్నీళ్లు పెట్టుకోలేదు, ఇంట్లోనే ఇబ్బంది పడింది. సాయంత్రం ఇంటికి వచ్చి ‘ఏంటి ఇలా ఉన్నావు?’ అంటే ‘ఇలా జరిగింది’ అని మొత్తం చెప్పిందని… మనం చాలా సహాయం చేసాము కదా… అతను ఎందుకు అంటాడు ఆ మాట అని బాధపడ్డామని చెప్పిన పోసాని, ఎంతవరకు సహాయం చేసామో ఒక ఉదంతాన్ని చెప్పుకొచ్చారు.

మా ఇంటి తలుపు దగ్గర పెద్ద పెద్దగా బోయపాటి శ్రీను ఏడుస్తున్నాడని, నా భార్య వెళ్లి ఏంటయ్యా శ్రీను అంటే… చేతులు రెండు కట్టుకుని, ఏడుస్తూ… వదినా… మా ఆవిడకు బాలేదు, పిల్లోడు పుట్టాడు వాడికి సీరియస్ గా ఉంది, డబ్బుల్లేవ్ అని ఎలా ఏడ్చాడో కూడా చేసి చూపించారు పోసాని. ఇలాగే ఏడుస్తున్నాడు… దైవసాక్షిగా చెప్తున్నా… నేనొచ్చి ఏంటిరా అంటే… అన్నయ్య హాస్పిటల్ కు వెళ్ళాలి డబ్బులు లేవు అంటే… నువ్వు ఏడవకురా… నీకు ఎంత కావాలో వదినను అడిగి తీసుకువెళ్ళు, హాస్పిటల్ బిల్లు మొత్తం మేమే ఇస్తాం… నేనున్నాను కదరా… ఎందుకు బాధపడతావు అని ధైర్యం చెప్పానని తెలిపారు.

మీ ఆవిడకు బిపి ఉంది కదా, స్కూటర్, ఆటో వద్దు… అప్పుడే కొత్తగా కారు కొన్నానని, ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉంది, ఆ తర్వాతే నేనే కొన్నాను, ఆ కారు ఇచ్చి పంపించాను, ఆ తర్వాత హాస్పిటల్ బిల్లు మొత్తం నా భార్యే కట్టింది… అలాంటి బోయపాటి శ్రీను నా భార్య వద్దకు వచ్చి అలా బిహేవ్ చేయవచ్చా…? అసలు వాడికి నాకు పోటీ ఏంటి? వాడిది సానుభూతి కాదుగా, చీప్ బిహేవియర్, ఆరోగేన్స్, ఏదైతే నేను హెల్ప్ చేసానో అదే నా బాధ. ఏ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవర్తించలేదే, కొరటాల శివ, సంపత్ నంది ప్రవర్తించలేదే… ఇండస్ట్రీలో ఎవరూ అంతలా నా మీద మాట్లాడలేదే… ఆ బాధ తప్ప వాడి మీద నాకు ఎందుకు ఉంటుంది బాధ అంటూ… సవివరంగా చెప్పిన పోసాని వ్యాఖ్యలతో బోయపాటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనన్న ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి.

గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తీసిన “సింహా” సినిమా సందర్భంలో జరిగిన తెరవెనుక వాస్తవాలు కూడా ఇటీవల కొరటాల శివ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ‘సింహా’ సినిమాకు కధ, మాటలు అందించిన కొరటాల పేరు టైటిల్ కార్డ్స్ లో వేయకుండా, తానే అందించినట్లుగా మొత్తం బోయపాటి పేరు వేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీంతో బోయపాటి శ్రీను ‘వ్యక్తిగత విలువలు’ విని సామాన్య ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories