ఇండియా – పాకిస్తాన్ బోర్డర్ లో తెలుగు నటుడు!

Brahmaji Pakisthan India Border Tripఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ తనకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. తనకు ఎంత ఇష్టమో తన భార్యకు కూడా అంతే ఇష్టం కావడంతో… ఇద్దరం కలిసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటామని, నేను సంపాదించిన మొత్తంలో ఎక్కువగా ఖర్చు పెట్టింది దీనికేనని, ఈ మొత్తం వెనుకేసుంటే ఆర్ధికంగా నేను చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాడినని, పిల్లలకు ఉంటానికి ఇల్లు, చదువు, కడుపు నిండా తిండి తప్ప ఎలాంటి ఆస్తులు ఇవ్వనవసరంలేదు, మిగిలిన వాటితో మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ రొటీన్ ప్రజల జీవిన విధానాలకు పూర్తిగా వ్యతిరేకమైన ఫిలాసఫీ చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.

అయితే సహజంగా సినీ జనాలు చెప్పేదొకటి… చేసేదొకటి… కావడంతో… ఈ విభిన్నమైన వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. కానీ, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్రహ్మాజీ చేస్తున్న పోస్ట్ లను గమనిస్తే… అతను చెప్పిన దాంట్లో అక్షరం పొల్లు కూడా తప్పు లేదని చెప్పాలి. దేశంలోని కొన్ని ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తున్న బ్రహ్మాజీ, వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తున్నారు.

ADVERTISEMENT

తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాన్న సహాయంతో ఇండియా – పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళగలిగాడు బ్రహ్మాజీ. రకుల్ తండ్రి ఇచ్చిన విఐపి పాస్ వలనే ఇది సాధ్యమైంది అంటూ బోర్డర్ వద్ద బ్రహ్మాజీ దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఎన్ని డబ్బులున్నా ఇలా బ్రహ్మాజీలాగా తిరగడం సాధ్యం కాదు. డబ్బుల కంటే చూడాలన్న ఆసక్తి, ఉత్సుకత ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే… ఒక సారి డబ్బులన్నీ అవజేసుకుని, మళ్ళీ వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ దగ్గర అప్పు కూడా చేసానని స్వయంగా బ్రహ్మాజీనే సెలవిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories