రష్మీ… నెటిజన్లు… మధ్యలో బ్రహ్మాజీ..!

brahmaji satire on rashmi gautamహీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమేడియన్ గా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాజీ సరదాగా ఉంటాడని ఆయనతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. అలాంటి బ్రహ్మాజీ తన కొంటెతనాన్ని సోషల్ మీడియా రష్మి అభిమానులకు రుచి చూపించారు. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ట్విట్టర్‌ లో అభిమానులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ఆ సందర్భంగా ఒక అభిమాని ‘నీకు ఎవరైనా బాయ్‌ ఫ్రెండ్ ఉన్నాడా?’ అని ప్రశ్నించాడు. దీనికి రష్మి ‘ఉన్నారంటూ’ సమాధానమిచ్చింది. ఈ కాన్వర్సేషన్ మధ్యలో ఎంటరైన బ్రహ్మాజీ ‘ప్లీజ్ చెప్పొద్దు.. నా పేరు రివీల్ చెయ్యకు’ అంటూ ఆమెకు తుంటరిగా నమస్కారం పెట్టాడు. దానికి సమాధానంగా రష్మి ‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’ అంటూ లవ్ సింబల్‌ చూపించింది. ఆ తరువాత కాసేపటికి మరో అభిమాని రష్మిని ‘సుధీర్ గురించి ఒక్క వర్డ్ చెప్పు’ అని కోరాడు.

మరోసారి కాన్వర్సేషన్ లోకి ఎంటరైన బ్రహ్మాజీ ‘సుడిగాలి’ అని సమాధానం చెప్పాడు. దీంతో రష్మి అభిమాని బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ ‘బ్రహ్మాజీ గారు మీకు మ్యారేజ్ అయినా కానీ మీరు అందంగా ఉండటానికి కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. ‘మ్యారేజ్ చేసుకోండి’ అందంగా మారతారు అని కొంటెగా సమాధానం చెప్పాడు. రష్మి ఛాట్ మధ్యలో బ్రహ్మాజీ రావడాన్ని ఆమె అభిమానులు ఆస్వాదించారు.

ADVERTISEMENT
Latest Stories