పెద్ద మనసు చాటుకున్న బ్రహ్మానందం!

Brahmanandamఇటీవలే కాలం చేసిన ప్రముఖ కమెడియన్ గుండు హనుమంతరావుకు ఒక తనయుడు ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందే తల్లి, సోదరిని పోగొట్టుకున్న ఆదిత్య జీవితం, తండ్రి మరణంతో ‘సోలో’ అయిపోయింది. గుండు హనుమంతరావు అనారోగ్యంతో ఉండడంతో చేతిలో ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని, హైదరాబాద్ వచ్చి తండ్రికి సేవలు చేస్తుండగా, కాలం ఇపుడు ఆదిత్యను ఒంటరిని చేసింది.

కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన ఆదిత్యకు తానున్నానంటూ టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ముందుకు రావడం చెప్పుకోదగ్గ పరిణామం. ఆదిత్య ఉద్యోగం నుండి పెళ్లి వరకు అన్నింటిని నెరవేర్చడానికి బ్రహ్మి బాధ్యతలు తీసుకున్నారని లభించిన కీలక సమాచారం. దీంతో తండ్రి కోల్పోయిన ఆదిత్యకు బ్రహ్మానందం రూపంలో కొండంత అండ దొరికినట్లయ్యింది. పెద్ద మనసును చాటుకున్న బ్రహ్మిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories