కెరీర్ తొలినాళ్ళల్లో యూత్ కధలకు ప్రాధాన్యం ఇచ్చిన మారుతీ, ప్రస్తుతం కామెడీ అండ్ లవ్ స్టోరీలకు ప్రాధాన్యత అందిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. అందులో భాగంగానే… తాజాగా “బ్రాండ్ బాబు” అనే సినిమా కధతో వస్తున్నాడు మారుతీ. అయితే ఈ సారి కేవలం కధ వరకే మారుతీ ప్రమేయం, దర్శకత్వాన్ని ‘ఈ టీవీ’ ప్రభాకర్ నిర్వహించారు. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాతో డైరెక్టర్ గా మారిన ప్రభాకర్, రెండవ సినిమాగా ఈ ‘బ్రాండ్ బాబు’ను తీసుకువస్తున్నాడు.
‘పని మనిషితో ప్రేమలో పడడం’ అనేది ఈ కధలో ఉన్న స్పెషాలిటీ. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా అందుకు తగ్గట్లుగానే రిలీజ్ చేసారు. పని మనిషిగా ఈషా రబ్బా నటిస్తుండగా, హీరోగా శైలేంద్ర పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శైలేంద్ర ప్రొడక్షన్స్ పై నిర్మాణం అవుతోంది. మారుతీ చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించే జేబీయే ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. మురళీశర్మ, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.



