KTR-BRS

తెలంగాణ రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంతో అట్టుడికి పోతోంది. అది చుట్టు తిరిగి కేసీఆర్‌ మెడకే చుట్టుకునేలా ఉంది. కానీ దీనిపై కూడా కేసీఆర్‌ మౌనంగా ఉండిపోవడంతో, ఆయన తరపున కేటీఆర్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

Also Read – ‘రోడ్డె’క్కిన ఏపీ ప్రభుత్వం..!

ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రమేయం ఉందన్నట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలకు, అటువంటి వార్తలు ప్రచురిస్తున్న మీడియాకు లీగల్ నోటీసులు పంపిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

కానీ మీడియాలో ప్రతీరోజూ ఈ వార్తలే వస్తుండటంతో కేటీఆర్‌ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారం గురించి గట్టిగా వాదిస్తూ నోరుజారి “2022-23లో మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, తనతో సహా పలువురు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని” చెప్పి అడ్డంగా దొరికిపోయారు.

Also Read – పాపం ఆవిడ ఇంకా ఎన్టీఆర్‌ దగ్గరే ఆగిపోయారు!

ఆ సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, ఐ‌టి మంత్రిగా కేటీఆర్‌ ఉండగా, వారికి అసదుద్దీన్‌ ఓవైసీ ఆప్తమిత్రుడుగా ఉన్నారు. అంటే కేసీఆర్‌ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేటీఆర్‌ స్వయంగా ధృవీకరించడమే కాకుండా తన తండ్రి కేసీఆర్‌ తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారని కేటీఆర్‌ స్వయంగా బయటపెట్టుకున్నట్లయింది!

ఈవిషయం మరెవరో చెపితే దానిని నమ్మలేము. కానీ కేటీఆర్‌ స్వయంగా 2022-23లో తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందనే విషయం యాపిల్ ఫోన్ కంపెనీ తనకు మెసేజ్ ద్వారా తెలియజేసిందని చెప్పుకున్నారు.

Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?

కేసీఆర్‌కు తన మేనల్లుడు హరీష్ రావుపై అనుమానాలు ఉంటే ఉండొచ్చు. మిత్రుడు అసదుద్దీన్‌ ఓవైసీపై అనుమానాలు ఉంటే ఉండవచ్చు. కానీ కేసీఆర్‌ తన కొడుకుని కూడా నమ్మడం లేదా?అనే సందేహం కలుగుతుంది.

కొడుకు ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్‌, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేయించకుండా ఉంటారా?అంటే ఉండరని కాంగ్రెస్‌ మంత్రులు, బీజేపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

కేటీఆర్‌ బయటపెట్టిన ఈ కొత్త విషయంతో ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు చెపుతున్నది నిజమే అని ధృవీకరించిన్నట్లయింది. కనుక రేపు ఏదో రోజూ కేటీఆర్‌కి కూడా పోలీసుల నుంచి పిలుపు వచ్చినా ఆశ్చర్యం లేదు.