india-australia-test-match

గత వారం ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ను గెలుచుకుంది భారత్. అయితే, అది టెస్ట్ చరిత్ర లోనే ఒక గుర్తిండిపోయే విక్టరీ గా నిలిచింది.

ఆస్ట్రేలియా టూర్ కు ముందు సొంతగడ్డ లో సిరీస్ ను వైట్వాష్ గా ఒడి, దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్న టీం ఇండియా, ఆసీస్ ను ఆ రేంజ్ లో డామినేట్ చేస్తారు అని భారత అభిమానులు సైతం ఆశించలేదు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

అయితే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా 1 – 0 తో ఆధిక్యంలో ఉన్న టీం ఇండియా తన రెండవ మ్యాచ్ ను ఎడిలైడ్ వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తో మొదలుపెట్టారు. అయితే, మొదటి బంతికే గత మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన యశస్వి డక్ అవుట్ గా వెనుతిరిగారు.

విశేషమేమనగా.. మొదటి టెస్ట్ లో యశస్వి స్టార్క్ ను ‘చాల నెమ్మదిగా బౌల్ చేస్తున్నావు’ అనగా, రెండవ టెస్ట్ లో అతడే యశస్వి ను మొదటి బాల్ కి అవుట్ చేసాడు. ఇదిలా ఉండగా, 0 కే వికెట్ పడినప్పటికీ, రెండవ వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని ముందుంచారు రాహుల్ – గిల్ జోడి.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

అయితే కేవలం 12 పరుగుల వ్యవధిలోనే భారత్ 3 ముఖ్యమైన వికెట్స్ కోల్పోయింది. రాహుల్, విరాట్ మరియు గిల్ లంచ్ కు ముందే పెవిలియన్ బాట పట్టారు. అయితే చాల ఏళ్ళ తరువాత మరల మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ రోహిత్ కు క్రీజ్ లో కష్ట కాలమే ఎదురయింది. కేవలం 3 పరుగులకే వెనుదిరిగారు.

అయితే, మొదటి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో నూ మెరుపులు మెరిపించిన తెలుగోడు ‘నితీష్’ మరోసారి భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించటం లో సక్సెస్ అయ్యారు. 54 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసాడు. ఇక అతని వికెట్ తో భారత్ 180 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.

Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్‌?

మిట్చెల్ స్టార్క్ తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా తరపున మరోసారి 5 -వికెట్ హాల్ ను సాధించారు. ఏకంగా 6 వికెట్లు తీసి కేవలం 48 పరుగులు సమర్పించుకున్నారు. అయితే, తమ మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా 24 పరుగుల వద్ద ఖవాజా రూపంలో తొలి వికెట్ ను బుమ్రా అందుకున్నారు.




అయితే, మొదటి టెస్ట్ లో కూడా ఇలాగే మొదటి ఇన్నింగ్స్ లో చతికిన పడ్డ భారత్, మ్యాజిక్ చేసి మ్యాచ్ ను గెలవగలిగారు. మరల అలాంటి మ్యాజిక్ ను రోహిత్ సేన ఇక్కడ కూడా రిపీట్ చెయ్యగలరా.?