కేటీఆర్ మాటలని సీరియస్ గా తీసుకోవచ్చా?

కేటీఆర్ మాటలని సీరియస్ గా తీసుకోవచ్చా?కొన్ని రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలంగాణ మంత్రి కేటీఆర్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గళమెత్తినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ క్రమంలో కార్మికులు చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ రావాలని కేటీఆర్‌ను, గంటా ఆహ్వానించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి శాసనసభ సమావేశాల తరువాత వస్తా అని కేటీఆర్ అన్నారట.

గంటా ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరినట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి గంటా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే స్టీల్‌ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైనదన్నారు.

ADVERTISEMENT

అదే సమయంలో ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పోలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని.. కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారని గంటా తెలిపారు. అయితే కేటీఆర్ మాటలను గంటా మరీ సీరియస్ గా తీసుకుంటున్నారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. గతంలో కూడా కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు.

పైగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తా అని మీడియా ముఖంగా ప్రకటించారు. ఆ తరువాత అటువంటిది ఏమీ జరగలేదు. సమయానుకూలంగా తెరాస నాయకులు ఇటువంటి వార్తలలో ఉండే వ్యాఖ్యలు చెయ్యడం మాములే. అయితే గంటా వాటిని మరీ సీరియస్ గా తీసుకుంటున్నారా లేక మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా నిజంగానే కేటీఆర్ విశాఖ వస్తారా? అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories