
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీరు ముగ్గురూ రాజకీయాలలో అనేక ఆటుపోట్లు తట్టుకొంటూ నిలబడి రాజకీయాలలో రాణించినవారే. కనుక వారి స్పూర్తితోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా 5 ఏళ్ళు ఏపీలో రాజకీయాలు చేస్తూ నిలబడాలనుకుంటున్నట్లు ఆమెను చూస్తే అర్దమవుతుంది.
ముందుగా అందుబాటులో ఉన్న ‘వైఎస్ రాజశేఖర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్‌లో నుంచి వైసీపిలోకి వెళ్ళిన నాయకులను ఆకర్షించాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
ఆమె చేస్తున్న ఈ ప్రయత్నాలు, వాటి పర్యవసనాల గురించి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కనుక ఆయన కూడా తన పార్టీని కాపాడుకునేందుకు ఆమెతో రాజీకి ప్రయత్నించవచ్చు లేదా తన పలుకుబడి, పరిచయాలను ఉపయోగించి ఆమెను ఆ పదవిలో నుంచి తప్పించేందుకు ప్రయత్నించవచ్చు. కనుక ఈవిషయంలో అన్నా చెల్లెలు మద్య రాజకీయాలు అనివార్యంగానే కనిపిస్తున్నాయి.
వైఎస్ షర్మిల టిడిపి సూపర్ సిక్స్ హామీల గురించి, ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీ గురించి ప్రశ్నిస్తుండటం గమనిస్తే రాజకీయాలలో నిలద్రొక్కుకునేందుకు ‘రోటీన్ రాజకీయాల’పై కూడా ఆమె దృష్టి పెట్టిన్నట్లే భావించవచ్చు.
Also Read – ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?
కానీ ఏపీ కాంగ్రెస్‌లో ఆమె కంటే చాలా మంది హేమాహేమీలు ఉన్నప్పటికీ ఆమె ఒక్కరి గొంతే వినిపిస్తుండటం గమనిస్తే పార్టీలో ఆమె ఏకాకిగా ఉన్నట్లు అర్దమవుతోంది. కనుక ఆమె వైసీపిలో సీనియర్ నేతలను ఆకర్షించగలరా లేదా? అనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అప్పుడే ఆమె రాబోయే 5 ఏళ్ళపాటు ఏపీ రాజకీయాలలో నిలబడగలరా లేదా? అనేది కూడా తెలుస్తుంది.