
ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రాన్ని, రాజధానిని, ప్రజలను కాపాడుకోవాలనుకుంటారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చంపేయాలని చాలా ప్రయత్నించారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించబోతుంటే, ఏవిదంగా విమర్శించాలో తెలియక ఇంతకాలం జగన్ అండ్ కో మౌనం వహించారు. కానీ ఇప్పుడు వరదలు రావడంతో అమరావతి పూర్తిగా మునిగిపోయిందని, సచివాలయం, హైకోర్టు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయి వచ్చేశారని వైసీపి సొంత మీడియా, వైసీపి సోషల్ మీడియా నాలుగు రోజులుగా దుష్ప్రచారం చేస్తోంది.
Also Read – కంచలో కుమ్మకులు.. కుమ్ములాటలు భలే ఉందే!
అయితే అమరావతి నిజంగా మునిగిపోయిందా లేదా?అనే విషయం చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో, విజయవాడ నగరమే నీట మునిగినప్పుడు, అమరావతి మునిగిపోకుండా ఉంటుందా? అనే సందేహం కలగడం సహజం. రాష్ట్ర ప్రజలందరికీ అమరవతిలో పరిస్థితి ఏవిదంగా తెలిసే అవకాశం లేదు. కనుక అమరావతి మునిగిపోయిందంటూ వైసీపి దుష్ప్రచారం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు అదే నమ్మాల్సి వస్తోంది.
కానీ ‘భవ్య’ అనే పేరుతో సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై రీల్స్ పోస్ట్ చేసే ఓ యువకుడు సెప్టెంబర్ 1వ తేదీన, అంటే… భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కొండవీటివాగు వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ మీదుగా అమరావతి కోర్ సిటీ అంతా తిరిగి తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read – వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు మరి ప్రభుత్వం?
దానిలో గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల క్వార్టర్స్, హైకోర్టు వగైరా భవనాలు ప్రతీ చోటికి వెళ్ళి వీడియో చిత్రీకరించారు. ఆ వీడియో చూస్తే అమరావతిలో చుక్క నీరు రోడ్లపై నిలిచిలేదని స్పష్టం అవుతుంది. పైగా వర్షం పడటం వలన రోడ్లన్నీ కడిగిన్నట్లు అద్దంలా మెరిసిపోతున్నాయి.
‘అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని, అది రాజధానికి పనికిరాని ప్రదేశమని సాక్షి మీడియా, వైసీపి సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం నిజమా కాదా?’ అని తెలుసుకునేందుకే తాను కోర్ క్యాపిటల్ ప్రాంతాలలో తిరిగి ఈ వీడియో చిత్రీకరించిన్నట్లు చెప్పారు.
Also Read – జాక్ అండ్ లైలా: రెండు స్పీడ్ బ్రేకర్లే
వైసీపి దుష్ప్రచారాన్ని ఖండించేందుకు ఆయన ఇంత శ్రమించి ఈ వీడియోని తీసి అమరావతి గురించి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం చాలా అభినందనీయం. ఈ వీడియో చూస్తే భారీ వర్షాలు, వరదలు వచ్చినా అమరావతికి ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం అవుతుంది.