‘సూర్య’ బ్యూటీకి సారీ చెప్పిన దర్శకుడు!

care-of-surya-movie- trimmedసందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా సుశీంద్రన్‌ దర్శకత్వంలో నటించిన ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’ (తెలుగులో కేరాఫ్ సూర్య) సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా బాగున్నప్పటికీ నిడివి పెద్దగా ఉందని, నిడివి తగ్గిస్తే బాగుంటుందని సూచనలు రావడంతో కొన్ని సీన్లకు కత్తెరవేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన దర్శకుడు సుశీంద్రన్ సినిమా నిడివి తగ్గించారు.

ADVERTISEMENT

అందులో భాగంగా మెహ్రీన్‌ నటించిన చాలా సన్నివేశాలను తీసేశారు. సుమారు 20 సన్నివేశాలను ఎడిట్ చేశారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలను కూడా మార్చినట్టు తెలిపారు. దీంతో మొత్తం 15 నిమిషాల నిడివి తగ్గిందని తెలుస్తోంది. ఈ సన్నివేశాలను సుమారు 15 రోజులు పాటు చిత్రీకరించామని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నామని సుశీంద్రన్ అధికారికంగా తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories