వర్మపై మరో కేసు నమోదు!

Ram Gopal Varma -God Sex Truthఐద్వా మహిళా నేత మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. విశాఖపట్టణంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వర్మ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖపట్టణం వేదికగా మహిళా సంఘాలు నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. పోర్న్ వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మహిళలను కించపర్చేలా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలనే మహిళా సంఘాల డిమాండ్ నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు.

ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కాగా టీవీ ఛానెల్ లో బుధవారం నాడు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories