‘కాస్టింగ్ కౌచ్’పై స్పందించిన టాలీవుడ్ టాప్ హీరోయిన్!

Rakul-Preet-Singh-into-War-of-Words-with-Tamil-Journoపంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో కాస్త పద్ధతిగానే కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత ‘అయ్యారీ’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో బిజీగా ఉన్న రకుల్… మరోవైపు ఓ హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. ‘మ్యాగ్జిమ్’ మేగజీన్ కవర్ పేజీ కోసం రకుల్ హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది.

ఒక్కసారిగా రకుల్ ఇలా కనిపించేసరికి హర్ట్ అయిన అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై విరుచుకుపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఇండియాటుడేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రకుల్ స్పందించింది. తన ఫొటో షూట్ పై కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు సానుకూలంగా స్పందించారని చెప్పింది. పాజిటివ్ కామెంట్లకు పొంగిపోవడం, నెగెటివ్ కామెంట్లకు కుంగిపోవడం తన నైజం కాదని తెలిపింది.

ADVERTISEMENT

తన కెరీర్ లో ప్రముఖ మేగజీన్ కవర్ పై ఒక్కసారైనా మెరవాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుందని… తనకు ఆ అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని వాడుకున్నానని చెప్పింది. తాను చేసిన పని తనకు నచ్చిందని, ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని చెప్పింది. తన అమ్మానాన్నలకే లేని అభ్యంతరం… వీరికెందుకని ఎదురు ప్రశ్నించింది. కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను తాను ఎన్నడూ ఎదుర్కోలేదని తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories