‘స్పైడర్’పై సెలబ్రిటీలు ముందే ఎందుకు చెప్పారు!

Celebrities about Mahesh Babu Spyder movieమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాపై ప్రముఖ దర్శకులు విడుదలకు ఒక రోజు ముందే ఎందుకు స్పందించారో ఇప్పుడు ప్రేక్షకులకు తెలిసి వచ్చినట్లయ్యింది. సాధారణంగా సినిమా విడుదలైన తర్వాత అది ఎలా ఉందో అంటూ తమ అనుభూతులను పంచుకుంటుంటారు. కానీ “స్పైడర్” విషయంలో బహుశా ఫలితం వారికి ముందుగానే తెలిసిపోయిందో ఏమో గానీ, విడుదలకు ఒక రోజు ముందే మహేష్ కు, చిత్ర యూనిట్ సభ్యులకు ‘ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్లు చేసారు.

ADVERTISEMENT

సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయడానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించారో ఏమో గానీ, ప్రస్తుతం మహేష్ తో ‘భరత్ అనే నేను’ సినిమాను తీస్తున్న కొరటాల శివ, ప్రిన్స్ కు ‘దూకుడు, ఆగడు’ అందించిన శ్రీను వైట్ల, 14 రీల్స్ బ్యానర్ నిర్మాతలు… ఇలా అందరూ విడుదలకు ఒక రోజు ముందుగానే చెప్పడంతో, ‘స్పైడర్’ ఫలితంపై అప్పుడే సందేహాలు నెలకొనగా, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత అది మరింత బలపడింది. ఇక ప్రిన్స్ అభిమానులు కూడా ‘లైట్’గా తీసుకోవాల్సిన పరిస్థితి మరోసారి తలెత్తినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories