ఇదో ‘ఫన్నీ’ ట్రైలర్!

Chal Mohan Ranga Theatrical Trailer Talkపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ + త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కలిపి నిర్మిస్తోన్న “చల్ మోహన్ రంగ” ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసారు. త్రివిక్రమ్ అందించిన ఈ కధను ‘రౌడీ ఫెల్లో’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. కధలోని మెయిన్ ప్లాట్ ను రివీల్ చేయకుండా, కేవలం ఫన్నీ సీన్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేసారు. అయితే చూపించినంత వరకు వీక్షకులకు వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యింది గానీ, సినిమాకు కావాల్సిన హైప్ ను మాత్రం తీసుకురాలేకపోయింది.

ADVERTISEMENT

సెటిల్డ్ గా నితిన్ లుక్, కమెడియన్స్ తో చేసిన ఇన్సిడెంట్స్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అలాగే ‘లై’ సినిమాతో సందడి చేసిన నితిన్ – మేఘ ఆకాష్ ల పెయిర్ మరోసారి కనువిందు చేయనుంది. నితిన్ తో కలిసి మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ ప్రొడక్షన్ వాల్యూస్ తెరపై కనపడుతున్నాయి. థమన్ సంగీతం ఇప్పటికే హిట్ కాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఉంది. ట్రైలర్ లో హింట్ ఇవ్వకుండా వదిలేసిన మెయిన్ ప్లాట్ ఏప్రిల్ 5వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకుంటుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories