పవన్ ‘పోస్టర్స్’ టాక్!

Chal Mohanranga First Look Talkపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణ బ్యానర్ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుండి ఆదివారం ఓ రెండు పోస్టర్లు విడుదలయ్యాయి. ఇవి పవన్ హీరోగా నటించిన సినిమాకు సంబంధించి కావు గానీ, తాజాగా పవర్ స్టార్ నిర్మిస్తున్న “చల్ మోహన్ రంగ” సినిమాకు సంబంధించినవి. నితిన్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను స్వయంగా పవర్ స్టార్ నిర్మిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కధను అందించారు.

ADVERTISEMENT

ఉత్సాహవంతమైన టైటిల్ కు తగ్గట్లుగానే పోస్టర్స్ కూడా ఉల్లాసంగా కనపడుతున్నాయి. హీరో నితిన్, హీరోయిన్ మేఘన ఆకాష్ లు స్టెప్పులు వేసుకుంటున్న పోస్టర్ ఒకటి కాగా, నితిన్ సోలోగా ఉన్న మరో పోస్టర్ ను రిలీజ్ చేసారు. చూడముచ్చటగా ఉన్న పోస్టర్స్ తో టైటిల్ ను ధృవీకరించగా, ‘ఎవ్రీ థింగ్ ఈజ్ ఎ సైన్’ అంటూ కుక్కపిల్ల, మందుబాటిల్ తో కూడిన లోగో, ఈ సినిమా కధపై ఆసక్తిని పెంచేలా చేసాయి.

ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చెలరేగిన విమర్శల రీత్యా, ఈ కధ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ నిర్మిస్తుండడం అనేది “చల్ మోహన్ రంగ”కు మరో హైలైట్ గా మారింది. పవన్ తో పాటు ఈ సినిమా ప్రొడక్షన్ లో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ కూడా ఉంది. ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎస్.ఎస్.థమన్ ఈ చిత్ర సంగీత దర్శకుడు.

ADVERTISEMENT
Latest Stories