chandrababu-addressing-mlas-and-mps-in-tdlp-meeting

రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో ఆ తర్వాత 2019, 2024లో కలిపి మొత్తం మూడుసార్లు ఏపీ శాసనసభ ఎన్నికలు జరిగాయి.

ఈ మూడు ఎన్నికలలో చాలా భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండేది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రా ప్రజలు గట్టిగా నమ్మారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మంచి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు.

Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?

జనసేన ఆ ఎన్నికలలో పోటీ చేయనప్పటికీ టీడీపీతో చేతులు కలిపి మద్దతు తెలిపింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ని ఆంధ్రా ప్రజలు మట్టిలో కలిపేయాలనుకున్నారు. కనుక టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపిని ఆదరించారు.

అదే సమయంలో కేసీఆర్‌ తొలిసారిగా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే ఆరాటంతో తెలంగాణ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించారు. కనుక జగన్‌కు ఆయన సాయం లభించలేదు. కనుక అన్నీ కలిసి రావడంతో కూటమి ప్రభుత్వం ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగింది.

Also Read – పాదయాత్ర: చరిత్ర కాదు…భవిష్యత్తే..!

కానీ 2019 ఎన్నికల నాటికి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపితో టీడీపీ విభేదించగా, టీడీపీతో జనసేన విభేదించి మూడు పార్టీలు వేరు పడ్డాయి. బీజేపి అధిష్టానంపై చంద్రబాబు నాయుడు కత్తులు దూసినందున కేంద్రం పరోక్షంగా వైసీపీకి తోడ్పడింది.

జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి, టీడీపీ, జనసేనలు రెండూ తీవ్రంగా నష్టపోయాయి. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్‌ చాలా శక్తివంతుడుగా మారి, చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు జగన్‌ అన్నివిదాల తోడ్పడ్డారు. ఆవిదంగా అన్నీ కలిసి రావడంతో 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి కాగలిగారు.

Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!

2024 ఎన్నికల నాటికి ఏపీలో మళ్ళీ రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు మారిపోయాయి. మళ్ళీ మూడు పార్టీలు చేతులు కలిపాయి. ఈసారి పవన్ కళ్యాణ్‌ మరింత పరిణతితో రాజకీయాలు చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసినప్పుడు వెంటనే వెళ్ళి పరామర్శించి అక్కడికక్కడే టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించడం కుల సమీకరణాలలో తద్వారా ఏపీ రాజకీయాలలో పెనుమార్పులు తెచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ కారణంగా సానుభూతి ఓట్ల రూపంలో టీడీపీ లబ్ధి పొందింది.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఓ మెట్టు దిగి బీజేపితో పొత్తు పెట్టుకోవడం చాలా మంచి నిర్ణయమని తర్వాత స్పష్టమైంది.

కనుక 2019 ఎన్నికలలో ఏవిదంగా వైసీపీకి అన్నీ కలిసి వచ్చాయో అదేవిదంగా 2024 ఎన్నికలలో కూటమికి అన్నీ కలిసివచ్చాయని స్పష్టమవుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈరోజు టీడీఎల్పీ సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, “మనమందరం జగన్‌ కుట్రలను నిరంతరం వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. గత ఎన్నికలలో కోడికత్తి, వివేకా హత్యతో మనల్ని దెబ్బతీయబోతున్నారని గ్రహించేసరికే చాలా ఆలస్యమైంది. ఆ కారణంగా ఎన్నికలలో నష్టపోయాము.

కనుక వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు జగన్‌ ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారో నిరంతరం గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలి. మళ్ళీ మనమే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలి.

మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ, వారి మెప్పు పొంది మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టాలని ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి,” అని చెప్పారు. సిఎం చంద్రబాబు నాయుడు చెప్పింది అక్షరాల నిజమని అందరికీ తెలుసు.

కానీ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని 2019 ఎన్నికలలో స్పష్టమైంది కనుక ఆ దిశలో అవసరమైన చర్యలు చేపట్టాలి.




“ఈసారి తప్పకుండా మనమే అధికారంలోకి వస్తాం.. మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని” జగన్‌ ఊరికే అనడం లేదని కూటమిలో ప్రతీ ఒక్కరూ గ్రహించి దాని కోసం జగన్‌ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకొని బాధ్యతాయుతంగా మెలగడం చాలా అవసరం. లేకుంటే 2019 చరిత్ర పునరావృతం అవుతుంది.