
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కృషి గురించి ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాలలోనే కాదు… జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి.
వరద నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలను, వాటి వేగం చూసి ఆశ్చర్యపోయారు.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
సిఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ప్రశంశించారు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించినా జగన్ ప్రభుత్వం సద్వినియోగపరుచుకోలేదని కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఎంతో సమర్ధంగా కేంద్రం సాయాన్ని ఉపయోగించుకుంటున్నారని కేంద్రమంత్రి ప్రశంశించారు. తాను ఢిల్లీ తిరిగి వెళ్ళగానే సహచర మంత్రులతో మాట్లాడి ఏపీకి అవసరమైన సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
విజయవాడ వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. కొందరు వ్యక్తులు సంతోషం పట్టలేక బైక్‌లపై తిరుగుతూ బియ్యం బస్తాలతో బారులు తీరిన లారీలు, ట్రాక్టర్లను, వాటి పక్కనే నిలిపి ఉంచిన వందల కొద్దీ బియ్యం పంపిణీ వాహనాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “చంద్రబాబు నాయుడు అడ్మినిస్టేషన్ అంటే ఇదీ…” ప్రశంశలు కురిపిస్తున్నారు.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాలలో వీధులు, ఇళ్ళని శుభ్రం చేసేందుకు మొన్న వంద అగ్నిమాపక యంత్రాలను రప్పించి ప్రతీ వీధికి, ఇంటికీ పంపించారు.
నేడు కొన్ని వందల బియ్యం లారీలు, వందల బియ్యం పంపిణీ వ్యానులు బారులు తీరడం చూసి విజయవాడ ప్రజలే కాదు… ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
వీటి ఏర్పాటు వెనుక పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి చాలా ఉంది. ఆయన చుట్టుపక్కల జిల్లాలలో కలెక్టర్లతో మాట్లాడి బియ్యం, పంపిణీ వాహనాలు రప్పించారు.
గురువారం నుంచే ప్రతీ ఇంటికీ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ మొదలైంది. అలాగే కూరగాయలు కూడా కేజీ రూ.2 నుంచి రూ.5లకే అందజేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూరగాయలు తీసుకొని వందల లారీలు, ట్రాక్టర్లు విజయవాడ చేరుకుంటున్నాయి. ఇలా జగన్ ఎప్పుడైనా చేశారా? అసలు ఇలాంటి ఆలోచన అయినా కలుగుతుందా? డౌటే!