తెలుగుదేశం పార్టీని తీసిపారేయలేం అందుకే

Chandrababu naidu andhra pradesh go bhogi sambaraluతెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో దాదాపుగా 40% ఓటు షేర్ నమోదు చేసింది. అయితే కేవలం 23 అసెంబ్లీ సీట్లు… మూడు పార్లమెంట్ సీట్లతో సరిపెట్టుకుంది. దానితో అధికార పార్టీ ఒకవైపు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు ఆ పార్టీని కబళించాలని అని చూస్తున్నాయి. చంద్రబాబు కు వయసు అయిపోతుందని, లోకేష్ ఆ స్థానం భర్తీ చెయ్యలేదని వారి వాదన.

అయితే ప్రజలలో మాత్రం టీడీపీకి ఆదరణ తగ్గలేదు అనే అనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ లో ఇప్పటికీ ఆ పార్టీనే వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రత్యామ్న్యాయంగా ఉంది. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో చంద్రబాబు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

ADVERTISEMENT

ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రమోట్ చెయ్యలేదు. తెల్లవారు జామున కావడంతో జనసమీకరణ కూడా సాధ్యం కాదు. అయినా చంద్రబాబు వస్తున్నారని తండోపతండాలుగా ప్రజలు, కార్యక్రర్తలు అక్కడికి తరలి వచ్చారు. జై చంద్రబాబు… జై టీడీపీ అంటూ ఆ ప్రదేశం అంతా నినాదాలతో మారుమోగిపోయింది.

వచ్చే స్థానిక ఎన్నికలలో తమ సత్తా చాటుతాం… తదుపరి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెస్తాం అంటూ కార్యకర్తలు ఉద్విగ్నభరితంగా ప్రతిజ్ఞ చేశారు. ఘోర ఓటమి చెందినప్పటికీ, నేతలు పార్టీని వీడి పోయినప్పటికీ… టీడీపీకి కార్యకర్తల బలం మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. దానిని తక్కువ అంచనా వేస్తే ఆయా పార్టీలకే నష్టం అని విశ్లేషకులు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories