చంద్రబాబు క్యాబినెట్ విస్తరణపై కొత్త ఊహాగానాలు!

Chandrababu Naidu - Cabinet Expansionఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుండి ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చెయ్యడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చెయ్యడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆయన కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందట.

ADVERTISEMENT

కోడెల స్థానంలో టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు స్పీకర్ అయ్యే అవకాశం ఉందట. కామినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్య శాఖను కోడెలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పైడికొండల మాణిక్యాల రావు నిర్వహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖను మండలి బుద్ధప్రసాద్ కు ఇచ్చే అవకాశం ఉందట.

వీరిద్దరితో పాటు ఒక ముస్లిం మైనారిటీకి గానీ ఒక షెడ్యూల్డ్ తెగకు చెందిన వారిని గానీ మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని తెలుస్తుంది. ఇప్పటిదాకా మంత్రివర్గంలో ఈ రెండు వర్గాల వారికి ప్రాతినిధ్యం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారికి కూడా ప్రాతినిధ్యం కలిపించాలని ముఖ్యమంత్రి అభిప్రాయం.

ADVERTISEMENT
Latest Stories