యాక్షన్ హీరో అర్జున్ నటించిన “ఒకే ఒక్కడు” సినిమాలో ‘ఒక రోజు సిఎం…’ అయిన సందర్భంలో హీరో అర్జున్ చేసిన సన్నివేశాలు గుర్తుందా? లేకపోతే ఒకసారి చంద్రబాబు చేసిన విన్యాసం చూస్తే ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది…
సీఎం : ఏమ్మా కాల్ సెంటరా..?
కాల్ సెంటర్ : నమస్కారం.
మా నుంచి మీకు ఏ సేవలు కావాలి సీఎం : మీ దగ్గర వాహనాలు ఉన్నాయా?
కాల్ సెంటర్ : ఉన్నాయి సార్
సీఎం : నేను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నా. తల్లీబిడ్డలను ఇంటికి పంపాలి. మీరు ఎంతసేపటిలో వాహనాన్ని పంపగలరు?
కాల్ సెంటర్ : వాహనం రావడానికి అర గంటకుపైగా పడుతుంది సార్
సీఎం : మీ దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి?
కాల్ సెంటర్ : సరిపడినన్ని ఉన్నాయి సార్
సీఎం : అలాంటప్పుడు అరగంట ఎందుకు? మరీ ఇంత లేటా? అందరికీ అందుబాటులో వైద్యం జరగాలని మనం 102 సర్వీసును ప్రారంభించాం. దీనిపై మీరు అవగాహన పెంచుకోండి. మొదటి రోజే ఇలా మాట్లాడితే ఎలా? “ట్విస్ట్” రివీల్ చేసారు చంద్రబాబు.
కాల్ సెంటర్ : పనితీరు మెరుగుపర్చుకుంటాం. పది నిమిషాల్లోనే వాహనం అందుబాటులో ఉంటుంది. థాంక్యూ సార్.
ఏపీలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించిన ‘తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్’ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ‘సీన్’ ఇది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో లాంఛనంగా ప్రారంభించిన సమయంలో కాల్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో ఈ విధంగా ఫోన్ లో మాట్లాడారు.





