సిగ్గుంటే షర్మిళ వ్యాఖ్యలకు జవాబు చెప్పు: జగన్ కి చంద్రబాబు సవాల్

Chandrababu Naidu Challenges Jaganతమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పవలె అనే సామెత మనకు తెలిసిందే. ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత మనకు తెలిసిందే. ఏంటి ఈ సామెతలు ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా. అసలు కథ ఇక్కడే ఉంది. తాజాగా వైఎస్ షర్మిళ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఈ రెండు సామెతలని గుర్తుచేస్తున్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే వివేకానంద రెడ్డి హత్యపై, ఆయన వ్యక్తిత్వం పై, ఆయన ఆస్థి పంపకాలపై కొన్ని మీడియాల్లో వస్తున్న వరుస కథనాలపై షర్మిళ స్పందించడమే కాకుండా వాటిని తీవ్రంగా ఖండించారు కూడా. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై వస్తున్న వార్తలను సైతం షర్మిళ ఖండించారు.

ADVERTISEMENT

అయితే షర్మిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు పెద్ద అవకాశం మరియు పదునైన ఆయుధాలుగా మారాయి. అందివచ్చిన అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. షర్మిళ చేసిన వ్యాఖ్యలను సత్తెనపల్లి రోడ్ షోలో చంద్రబాబు ప్రస్తావించారు.

జగన్ రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు షర్మిళ నే చెప్పింది.. మా బాబాయ్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ప్రజానాయకుడని, ఎప్పుడూ ఏ చెడ్డపని చేయలేదని, మా బాబాయ్ వివేకా లాంటి మంచి వ్యక్తి పైన అపనిందలు వేసే పేపర్లు, టి.వీలు గాని, వ్యక్తులను గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ షర్మిళ చేసిన వ్యాఖ్యలకు సిగ్గుంటే జగన్ సమాధానం చెప్పాలంటూ సత్తెనపల్లి సభ నుండి చంద్రబాబు జగన్ కి సవాల్ విసిరారు.

మరి బాబు విసిరిన సవాల్ కు జగన్ స్పందిస్తారా! లేక ఆయన మంత్రి వర్గం స్పందిస్తుందా, లేక కొడాలి నానితో బాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇప్పిస్తారా లేక అసలు సవాల్ స్వీకరిస్తారా లేదా అనే ఆసక్తికర చర్చ ప్రస్తుతం జరుగుతుంది.

అయితే అన్న తనవాడైనా ధర్మం మాట్లాడింది షర్మిళ అని ఓ వర్గం షర్మిలపై ప్రశంశల జల్లు కురిపిస్తుంటే, ఇంటి గుట్టు లంకకు చేటు అయ్యినట్లు అన్న సామెతను గుర్తుచేసాయి షర్మిళ వ్యాఖ్యలు అని మరికొందరు విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories