వరుసగా ఏడవ సారి చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల ప్రకటన

 Chandrababu Naidu Family Assets Announced seventh timeతెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా ఏడవ సారి తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. మార్కెట్‌ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని వివరించారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని ఆయన కుమారుడు నారా లోకేష్ చెప్పారు.

ADVERTISEMENT

మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని.. మాపై విమర్శలు చేసేవాళ్లు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా ఎప్పుడూ తన ఆస్తులు ప్రకటించలేదని, ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని.. అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆస్తులు వివరాలు
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు
లోకేశ్‌ నికర ఆస్తులు : రూ.15.21 కోట్లు
బ్రాహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు
దేవాన్ష్‌ నికర ఆస్తులు : రూ.11.54కోట్లు

ADVERTISEMENT
Latest Stories