మహాభారతం, కురుక్షేత్రం, కౌరవులు, పాండవులు, అభిమన్యుడు, అర్జునుడు అంటూ ఇతిహాసాలను కూడా తమ రాజకీయ అవసరాల కోసం వాడేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సింహం సింగల్ అంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
అయితే ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పొత్తులతో రాజకీయ ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయడానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని అయిన హస్తినకు బయలుదేరారు.
ఇప్పటికే టీడీపీ, జనసేనల పొత్తు పై ఒక క్లారిటీకి వచ్చిన ఇరు పార్టీల అధినేతలు పొత్తులో బీజేపీ పాత్ర పై తుది నిర్ణయం కోసం బీజేపీ అధిష్టానంతో చర్చలకు సిద్ధమయ్యారు. 2014 కూటమిని పునర్నిర్మించి ఏపీ భవిష్యత్తు కు భరోసా కలిపించడానికి టీడీపీ, జనసేనలు నడుంబిగించారు.
గత ఎన్నికలలో వైసీపీ విజయం వెనుక పరోక్షం గా పనిచేసిన కొన్ని శక్తులలో బీజేపీ కూడా ఒకటి అనేది జగమెరిగిన సత్యమే. ఈ సారి ఆ అవకాశం జగన్ కు దూరం చేయాలనీ ముందు నుంచి పట్టుదలగా ఉన్న పవన్ ఇటు టీడీపీ పార్టీ కి అటు బీజేపీ పెద్దలను సమన్వయం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా ప్రచారం జరిగింది.
నోటా కన్నా తక్కువ ఓటు శాతం ఉన్న బీజేపీ పార్టీ ప్రత్యేక్షంగా ఏపీ రాజకీయాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపకపోయినా పరోక్షంగా మాత్రం ప్రభావితం చేయగలదు అని గత ఎన్నికలలో రుజువు చేసింది కాబట్టి బీజేపీ ని కలుపుకుని టీడీపీ, జనసేన కూటమి ముందుకెళ్ళడం ఈ కూటమికి బలం తెలీకపోయినా వైసీపీ పార్టీని బలహీన పరచగలదు అని ఇరు పార్టీల అధినేతలు గట్టిగా నమ్ముతున్నారు.
ఇందులో భాగంగానే బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. ఇక పొత్తులకు హస్తినలో క్లైమాక్ ఇచ్చి ఇక ఎన్నికల ప్రచారంలో దిగి వైసీపీ ప్రభుత్వానికి శుభకార్డు వేయాలన్నదే బాబు ఆలోచనగా కనపడుతుంది. అయితే ఇప్పటికే జనసేన పార్టీ కోసం కొన్ని స్థానాలలో నేతలను త్యాగాలకు ఒప్పించాల్సిన బాబు ఇప్పుడు
బీజేపీ చేరిక అనివార్యం అయితే మరికొన్ని టీడీపీ స్థానాలను వదులు కోవాల్సిందే.
ఈ పొత్తులు ఫలించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగితే ఎక్కువ లాభపడేది టీడీపీ నే అలాగే పొత్తు వికటిస్తే ఎక్కువగా దెబ్బతినేది కూడా టీడీపీ పార్టీనే.ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆచి తూచి పొత్తు పై అడుగులు ముందుకు వేయాలి టీడీపీ పార్టీ.




