జగన్ పై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు!

chandrababu-jokes-jagan-jailవైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై పెట్టే సమావేశాలకు వెళ్తే ఆయనలా జైలుకు వెళ్లడం నేర్పిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు… రాష్ట్రాభివృద్ధి కోసం తాను నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ విద్యార్థులతో తనపై బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

“ఇక్కడున్న వారికి కూడా పిల్లలు ఉండే అవకాశం ఉంది. వారిని బుద్ధిగా కళాశాలలకు వెళ్లి చదువుకుని రమ్మనండి. మీటింగ్‌లు, చాటింగ్‌లు అంటూ జగన్ పెట్టే సమావేశాలకు వెళ్తే వారికి జైలుకు వెళ్లడం ఎలాగో నేర్పిస్తారు. ప్రత్యేక హోదా అంటూ ఆయన పెట్టే సమావేశాలకు వెళ్తే వారు కూడా జైలుకు వెళ్ళే ప్రమాదం ఉంది” అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అని అందరూ గళమెత్తుతున్నారని, కానీ దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మాత్రం చెప్పలేక నీళ్లు నములుతున్నారని అన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories