చంద్రబాబు స్పీడు మామూలుగా లేదుగా!

Ahead Of Union Budget, CM Chandrababu Naidu Meets PM Narendra Modi

చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పనిచేస్తూనే ఉన్నారు. అసలు ఈ వయసులో ఆయన అంత చురుకుగా ఎలా పనిచేస్తున్నారని ఓ యువకుడు తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ అంతుపట్టడం లేదు.

ADVERTISEMENT

ఉదయం టిఫిన్ చేస్తూ టీవీ ఆన్‌ చేస్తే సిఎం చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమవుతుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రావనమాసం పిండవంటలు తినేసి భుక్తాయాసంతో తాపీగా కాళ్ళు జాపుకొని టీవీ ముందు కూర్చుంటే, ఈ మహానుభావుడు సీఐఐ సభ్యులతో సమావేశమవుతూ కనిపిస్తారు.

మళ్ళీ రాత్రి టీవీ ఆన్‌ చేస్తే ఢిల్లీకి బయలుదేరారని వార్త! మరో 30 ఏళ్ళు రాజకీయాలు చేసే వయసు, శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకున్న చిన్న పిల్లోడు తాడేపల్లి ప్యాలస్‌లోనో లేదా బెంగళూరు ప్యాలస్‌లోనో కూర్చొని ట్వీట్స్ వేస్తుంటే, ఈ ముసలాయన మాత్రం గిరగిర తిరిగేస్తూనే ఉన్నారు.

శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీతో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పర్యటించి వెళ్ళారు. కనుక అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ ఇస్తామన్న రూ.15,000 కోట్ల స్వల్ప వడ్డీపై దీర్గకాలిక రుణం మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేత ఓ మాట చెప్పించాలని సిఎం చంద్రబాబు నాయుడు తాపత్రయ పడుతున్నారు.

జగన్‌ పుణ్యమా అని పోలవరం ప్రాజెక్టు కధ మళ్ళీ మొదటికొచ్చింది. అది జాతీయ ప్రాజెక్టు దానిని పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఇదివరకే కేంద్రం చెప్పింది. కనుక పోలవరంలో దెబ్బ తిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం కోసం రూ.3080 కోట్లు కేంద్రమే ఇవ్వాలని ప్రధాని మోడీని ఒప్పించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులను కూడా కలిసి రాష్ట్రానికి సంబందించిన అంశాలపై చర్చించనున్నారు.

అసలు ఈ వయసులో ఈయనకు ఇంత ఓపిక, శక్తి ఎక్కడివి?ఇంత చురుకుగా ఎలా పనిచేయగలుగుతున్నారు? ఈయన అమృతం ఏమైనా తాగారా? అనే సందేహం కలుగకమానదు. ఆ అమృతం మరేదో కాదు… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, పట్టుదల, నిబద్దతలే అని పెద్దాయన చెపుతుంటారు. నిజమే కదా

ADVERTISEMENT
Latest Stories