Chandrababu Naidu Must Win This Credibility

రాజకీయ పార్టీలకే కాదు.. అవి నడిపే ప్రభుత్వాలకు కూడా విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ప్రజలు వాటిని ఎన్నుకొని అధికారం కట్టబెడతారు. అప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తాయి.

ఉదాహరణకు ప్రజలు జగన్‌ మాటలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అందుకే ప్రజలు ఆయనని గద్దె దించేశారు.

Also Read – విజన్ 2029 కూడా అవసరమేగా?

2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించిన ప్రజలే మళ్ళీ ఆయనకి అధికార పగ్గాలు అప్పజెప్పారు. అంటే రాజకీయ పార్టీలకు విశ్వసనీయత ఎంత ముఖ్యమో అర్దం చేసుకోవచ్చు.

ఇదే విదంగా జగన్‌ అరాచక పాలన చూసిన పారిశ్రామికవేత్తలు 5 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికాగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తున్నాయి.

Also Read – ఎఫ్-1 కేసు: సుప్రీంకోర్టు సింపుల్‌గా తేల్చేసింది!

అంటే జగన్‌ ప్రభుత్వానికి లేని విశ్వసనీయత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందని స్పష్టమవుతోంది.

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జగన్‌ వమ్ము చేసుకొని నష్టపోగా, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read – సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్స్…. భయపెడుతున్నాయి!

కానీ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పనిచేసినా 2019 ఎన్నికలలో ప్రజలు ఆయనని కాదనుకొని జగన్‌ని గెలిపించారు కదా?కనుక 2029 ఎన్నికలలో మళ్ళీ అలాగే చేయరని నమ్మకం ఏమిటి?మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని జగన్‌ పదేపదే చెపుతున్నారు కదా?అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజమే! అయితే దాదాపు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదనుకోలేము. కనుక వైసీపీకి మరో అవకాశం లేకుండా చేసేందుకు రాజకీయంగా అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టారు.

వైసీపీని కట్టడి చేస్తామని చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించారు కనుకనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తున్నాయని భావించవచ్చు.

కానీ జగన్‌ పోరాట పటిమని, ఆయనకు అండగా నిలిచే రాజకీయ శక్తులను తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో 2019 ఎన్నికలలోనే రుచి చూపించారు. అధికారం చేతికి వస్తే తన పాలన ఎలా ఉంటుందో ప్రజలకి, పారిశ్రామికవేత్తలకి కూడా బాగా రుచి చూపించారు.

ఐదేళ్ళపాటు జగన్‌ వేధింపులు భరిస్తూ పార్టీ చెల్లా చెదురు అయిపోకుండా కాపాడుకోవడం, అటువంటి పరిస్థితులలో ఎన్నికలలో వైసీపీని ఓడించడం రెండూ అసాధారణమైనవే. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూటమి ప్రభుత్వం నెత్తిన వైసీపీ కత్తిలా వ్రేలాడుతూనే ఉంది. దానిని మరింత సమర్ధంగా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పధకాలు అమలుచేసి చూపిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. వైసీపీని కట్టడి చేయగలమని నిరూపించి పారిశ్రామిక వేత్తల నమ్మకాన్ని పొందాల్సి ఉంటుంది. ఇది కత్తి మీద సామువంటిదే అని అర్దమవుతూనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ పరీక్షలో విజయం సాధిస్తారా? కాలమే సమాధానం చెపుతుంది.