ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఒకే సమయంలో ఒకే స్థాయిలో భారీగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కనుక పక్క రాష్ట్రంలో పరిస్థితి ఏవిదంగా ఉందో చూడటం సహజం.
Also Read – ఆ విషయంలో జగన్ కంటే ప్రశాంత్ కిషోరే బెటర్
వరద ముప్పుని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, సిఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు విశ్రాంతి తీసుకోకుండా మూడు రోజులుగా సహాయ చర్యలని పర్యవేక్షిస్తూ, ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెపుతున్నారని సోషల్ మీడియాలో తెలంగాణకు చెందినవారు ప్రశంశిస్తున్నారు.
చివరికి చంద్రబాబు నాయుడు చాలా ద్వేషించే బిఆర్ఎస్ పార్టీ (కేటీఆర్) కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చాలా చురుకుగా అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి వరద బాధితులను ఆదుకుంటున్నారని మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు సహాయ, పునరావాస కార్యక్రమాలకు చేస్తున్న ఏర్పాట్లను చూస్తున్నవారు ఈవిషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించలేకపోయిందని విమర్శిస్తున్నారు.
Also Read – పాపం శ్యామల… ఎలా నెగ్గుకొస్తారో?
కానీ 74 ఏళ్ళ వయసులో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంతగా శ్రమిస్తుంటే యువకుడైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మొక్కుబడిగా ఖమ్మంలో పర్యటించి వెళ్ళిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నేటికీ చంద్రబాబు నాయుడు సహాయ చర్యలని పర్యవేక్షిస్తుంటే, రేవంత్ రెడ్డి ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?
సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఒక్కో డివిజన్‌కి ఒక్కో ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించడంతో సహాయ, పునరావాస చర్యలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో వరద ప్రభావిత వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలలో ఈ స్థాయిలో సహాయ, పునరావాస కార్యక్రమాలు జరుగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు నిన్న విజయవాడలో ప్రజలతో మాట్లాడుతూ, “వరదనీరు వెనక్కు వెళ్ళగానే విద్యుత్ సిబ్బందిని మీ ప్రాంతాలకు పంపిస్తాను. వాళ్ళు ఎటువంటి విద్యుత్ సమస్యలున్నా వెంటనే పరిష్కరిస్తారు. అలాగే ఫైర్ ఇంజన్లు పంపించి ప్రతీ వీధి, ఇల్లు కడిగిస్తాను. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తాను.
ప్రభుత్వం తరపున ఏ సహాయ సహకారాలు కావాలన్నా మీ ఇళ్ళకు వచ్చే అధికారులు, సిబ్బందికి చెప్పండి. వాళ్ళు స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి చెప్పండి. ఈ కష్టకాలంలో మీ ఆందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంత చురుకుగా, ఇంత సమర్ధంగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మొక్కుబడిగా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరినీ పోల్చి చూసినప్పుడు నిజమే అనిపించక మానదు.
రేపటి నుంచి మెడికల్ క్యాంప్స్ మొదలు పెడుతున్నాం..
రేపటి నుంచి కరెంటు ఇవ్వటం మొదలు పెడతాం.
వాటర్ ట్యాంకర్స్ రెడీ చేసాం, రేపటి నుంచి వరద క్లియర్ అయిన ప్రాంతంలో ఫైర్ ఇంజిన్స్ ద్వారా ప్రజల ఇళ్లు శుభ్రం చేస్తాం. ప్రతి ఇంటిని క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే.
బ్లీచింగ్ కూడా మొదలు… pic.twitter.com/9pokWa1X70— Telugu Desam Party (@JaiTDP) September 3, 2024