“కోడెల” మరణానికి అసలు కారణం జగనే: బాబు షాకింగ్ కామెంట్స్

Chandrababu Naiduప్రస్తుత సమాజంలో మూడు పదుల వయస్సు కూడా నిండని వారు పండు ముసలి వారిలా ఓపిక లేనట్టుగా వ్యవహరిస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 70 ఏళ్ళ వయస్సులో కూడా నవ యువకుడిలా ఉత్సాహంగా ఉరకలెత్తుతున్న తీరు సకల జనులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కు సత్తెనపల్లి ప్రజలు భారీగా హాజరై బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన చూసి బాబు ఒకింత ఉద్వేగానికి లోనైయ్యారు.

ADVERTISEMENT

సత్తెనపల్లిలో ఎప్పుడూ కనిపించనంత స్పందన ఈరోజు కనిపిస్తుందని, తాను ఎన్నోసార్లు సత్తెనపల్లి సందర్శించానని, కానీ ఈరోజు వచ్చిన స్పందన మునుపెన్నడూ చూడలేదని, ఈరోజు సత్తెనపల్లి గర్జించిందని బాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

సత్తెనపల్లి రోడ్ షోలో బాబు కోడెల శివప్రసాదరావు గురించి ప్రస్తావించారు. కోడెల ఎవ్వరికీ భయపడిన వ్యక్తి కాదని, “పల్నాటి పులి” కోడెల శివప్రసాదరావు అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో పనిచేశారని, క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేసారని, గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శంఖుస్థాపన చేశారని, మరుగుదొడ్లు, స్మశానాలను విప్లవాత్మక రీతిలో అభివృద్ధి చేశారని, కోటప్పకొండ అంటే కోడెల శివప్రసాదరావు గుర్తొస్తారని కోడెల సేవలను బాబు కొనియాడారు. అలాంటి మంచివ్యక్తిని మానసికంగా వేధించి, వెంటాడి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వ్యక్తి జగన్ అని, జగన్ ని చరిత్ర క్షమించదని బాబు ఘాటుగా విమర్శించారు.

అదేవిధంగా రాష్ట్రవిభజన జరిగి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత 16 వేల కోట్ల లోటుబడ్జెట్ ఉందని.. అయినా తాను ఎవ్వరికీ ఏలోటు రానివవ్వలేదని బాబు అన్నారు. 200 రూపాయలుగా ఉన్న ఫించన్ ని 2000 చేశారని, ఉద్యోగస్తులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని బాబు అన్నారు.

అన్నా క్యాంటీన్లు, చంద్రన్న భీమా, విదేశీ విద్య, ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీలకు సబ్ ప్లాన్ వంటివి తెలుగుదేశం పార్టీ అమలు చేసిందని, కానీ వాటన్నింటిని జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని బాబు విమర్శించారు. జగన్ తెచ్చినవి నవరత్నాలు కాదని, అవి నవ మోసాలు అని, జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఇచ్చేది 10 రూపాయలు అని గుంజేది 100 రూపాయలు అని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, గ్యాస్, నూనె, పెట్రోల్, కరెంట్ బిల్లులు, రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు, మద్యం ధరలను కూడా తీవ్రంగా పెంచేసారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నది జగన్, అసలైన దోపిడిదారుడు జగన్ అంటూ చంద్రబాబు జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే “సైకో పోవాలి.. సైకిల్ పాలన రావాలంటూ” బాబు పిలుపునిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories