ఈ వయసులో కూడా సోషల్ మీడియాపై ఇంత అవగాహనా!

Chandrababu Naidu Leadership Conclave

వైసీపీ సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగాను వైసీపీ వాడుకుంటోంది. అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ కూడా వాడేసుకుంటూ కూటమి ప్రభుత్వంపై ఫేక్ వార్తలు,ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తూనే ఉంది. అయితే అది ‘యువనేత’ నాయకత్వంలో, సజ్జల స్క్రిప్టులతో పని చేస్తుంటుంది. కనుక సోషల్ మీడియాలో వైసీపీ దూసుకుపోతుంటుంది.

మంగళగిరి టీడీపి ప్రధాన కార్యాలయంలో టీడీపి అధ్వర్యంలో జరుగుతున్న ‘లీడర్‌షిప్ కాన్‌క్లేవ్’లో సోషల్ మీడియా గురించి అయన చెప్పిన విషయాలు విన్నప్పుడు, ఈ వయసులో కూడా ఆయనకు దానిపై ఇంత అవగాహన ఉందా? అని అనిపించక మానదు.

ADVERTISEMENT

“సోషల్ మీడియాలో మెతకగా మాట్లాడితే వినే వాళ్ళుండరు. అలాగని ఆవేశంగా మాట్లాడితే ప్రజలకు మన గురించి దురభిప్రాయం ఏర్పడుతుంది. కనుక చెప్పాల్సిన విషయాన్ని చాలా హుందాగా చెప్పాలి.

అలాగని గంటల గంటలు ఉపన్యాసాలు ఇస్తామంటే వినేందుకు ఇప్పుడు ఎవరికీ ఓపిక లేదు. ఏం చెప్పలన్నా కేవలం 50 సెకన్లలోనే చెప్పాలి. అదీ.. పూర్తి వివరాలు, గణాంకాలతో సహా సాధికారికంగా చెప్పాలి. అప్పుడే ప్రజలు మన మాటలు వింటారు.

బయట మాకు బోలెడు పలుకుబడి ఉంది. కనుక సోషల్ మీడియాతో మాకేమిటి పని? అనుకుంటే చివరికి మీరే వెనుకబడిపోతారు.

రాబోయే రోజుల్లో సోషల్ మీడియాపై పూర్తి పట్టు గలవారిదే పైచేయిగా ఉంటుంది. కనుక దాని గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కాకపోతే అవుట్ డేటడ్‌ అయిపోతారు.

వైసీపీ విధానం గురించి వివరిస్తూ, అది ముందుగా ఒక ఫేక్ వార్తని సృష్టిస్తుంది. ఆ తర్వాత దాని గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెడుతుంది. వైసీపీ నేతలు దానిని కొనసాగిస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే.. తమ అబద్దాలను ప్రజలు నిజమని నమ్మేవరకు!

కనుక దాని దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మనం అలసత్వం ప్రదర్శించినా లేదా సమర్ధంగా తిప్పికొట్టకపోయినా చివరికి అది చెప్పే అబద్దమే నిజంగా చలామణి అవుతుంది. అప్పుడు మనమే నష్టపోతాము.

కనుక వైసీపీ ఏ అంశంపైనైనా దుష్ప్రచారం చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే, వెంటనే పూర్తి వివరాలతో దానికి కౌంటర్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి,” అంటూ సిఎం చంద్రబాబు నాయుడు టీడీపి నేతలకు సోషల్ మీడియా దాని వాడుక, ప్రభావం గురించి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వివరించారు.

అయినా క్వాంటం కంప్యూటింగ్ గురించి ఆలోచించే, మాట్లాడే ఆయనకి సోషల్ మీడియాపై అవగాహన లేదనుకోవడమే అవివేకం కదా?

ADVERTISEMENT
Latest Stories