మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఏడూ పదుల వయస్సులో కూడా ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటూ సభకు విచ్చేస్తున్న ప్రజానీకాన్ని, తమ పార్టీ కార్యకర్తలను తన ప్రసంగాలతో ఉర్రుతలూగిస్తున్నారు. గతంలో కంటే భిన్నమైన శైలిలో తన ప్రసంగాల తీరుని కొనసాగిస్తూ ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకునేలా వినోదంతో కూడిన ప్రసంగాలతో ముందుకెళ్తున్నారు.
సభ ఏదైనా, ప్రాంతామెక్కడైనా, పోటీ చేసే అభ్యర్థి టీడీపీనా, జనసేనా, బీజేపీ నా అని ఆలోచించకుండా కూటమి అభ్యరి గెలుపు కోసం మండుటెండలను కూడా లెక్కచేయకుండా రోజుకి రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ ఎక్కడ అలసి పోకుండా వైసీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి చుక్కలు చూపిస్తున్నారు బాబు.
ఆత్మకూరులో జరుగుతున్న టీడీపీ ప్రజాగళంలో పాల్గొన్న బాబు జగన్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ…చూసారా తమ్ముళ్లు గులకరాయితో నేను హత్య ప్రయత్నం చేశానంటూ బ్యాండేజ్ డ్రామా ఆడిన ఆ డ్రామా నాయుడి డ్రామా ఈనాడు బయటపడింది. ఎన్నికలు అయ్యే వరకు ఈ బ్యాండేజ్ తో తిరగాలనుకున్నాడు..కానీ ఇప్పుడు రాష్ట్రంలో అందరూ బ్యాండేజ్ వేసుకుని తిరగడంతో ఆ బ్యాండేజ్ తీసేసాడు.
గతంలో కూడా బాబాయిని గొడ్డలి వేటు వేసి నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు కనపడని గులకరాయితో నేను హత్య ప్రయత్నం చేశానంటూ మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. కొట్టిన రాయి కనపడలేదు…తగిలిన దెబ్బ కనపడడం లేదు అంటూ జగన్ పై వరుస పెట్టి కౌంటర్లు పేలుస్తూనే ఉన్నారు బాబు.
హూ కిల్డ్ బాబాయ్ అంటూ మొదలు పెట్టిన బాబు గొడ్డలితో హత్య జరిగితే పట్టించుకోలేదు కానీ, గులకరాయితో హత్య ప్రయత్నం అంటూ డ్రామాలు మొదలుపెట్టాడన్నారు. అలాగే కొవ్వూరులో నిర్వహించిన సభలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న మీద కుడా అదే స్థాయిలో విమర్శలు కొనసాగించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రసన్నకు మరో పేరు ఉంది అదే ‘పర్సెంటేజ్’ ఎమ్మెల్యే అంటూ సభలో నవ్వులు పూయించారు.
ప్రసన్నను ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకు పెర్సెంటేజ్ ను ప్రసాదంగా పెట్టాల్సిందే అంటూ, గోవా, పాండిచ్చేరి నుంచి మీకోసం మద్యం తెప్పించి మీకు ఇంత పెద్ద సర్వీస్ చేసిన ఎమ్మెల్యే ను మీరు మర్చిపోతే ఎలా తమ్ముళ్లు, మీకు మద్యం అమ్మి మీ రక్తం తాగుతున్న ఈ ఎమ్మెల్యే మీకు అవసరమా..? అంటూ వైసీపీ నేతలను ఒకరకంగా పబ్లిక్ గా బాబు ర్యాగింగ్ చేస్తున్నారనే చెప్పాలి.




