
ఒక రాజకీయ పార్టీ, దాని అధినేత ఏవిదంగా పనిచేయాలో తెలుసుకునేందుకు టీడీపీ దాని అధినేత చంద్రబాబు నాయుడుని ‘కేస్ స్టడీ’గా తీసుకోవచ్చు. ఎలా పనిచేయకూడదో వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలని వాటి అధినేతలు జగన్, కేసీఆర్‌లను ‘కేస్ స్టడీ’గా తీసుకోవచ్చు.
Also Read – వైసీపీ PHD లు ఎన్నో ఎన్నెన్నో.?
టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ప్రజల మద్యనే ఉంటారు. నిరంతరం పని చేస్తూనే ఉంటారు. పదవి, అధికారం దక్కాయి కదాని ఆయన రిలాక్స్ అవరు. పైగా ఇంకా కష్టపడుతూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
సిఎం చంద్రబాబు నాయుడు రోజువారీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, ఈయనకు అలుపనేది ఉండదా?ఈ వయసులో కూడా ఇంత చురుకుగా ఎలా పని చేయగలుగుతున్నారు?పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఒకే సమయంలో పాలనని, రాజకీయాలను ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు?
Also Read – చంద్రబాబు నాయుడు మార్క్ చూపితే చాలు!
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు మొదలు రాష్ట్రంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఇన్ని సమావేశాలలో ఎలా పాల్గొనగలుగుతున్నారు?ఇన్ని పనులతో తీరిక లేని జీవితం గడుపుతూ ఏదో గ్రామం లేదా పట్టణంలో సామాన్య ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారి యోగ క్షేమాలు కనుగొనేందుకు ఆయనకి సమయం ఎలా లభిస్తోంది?
సిఎం చంద్రబాబు నాయుడు ఒక్కరికే రోజుకి 48 గంటలున్నాయా?లేకుంటే ఉన్న 24 గంటల సమయంలో ఇన్ని పనులు, పర్యటనలు, సభలు, సమావేశాలు, పలకరింపులు ఎలా సాధ్యం? అని సామాన్య ప్రజలకు కూడా సందేహం కలుగుతుంది.
Also Read – జగన్ భావోద్వేగం నిజమా? లేక అవసరమా?
కానీ ఆయనకి అందరిలాగే రోజుకి 24 గంటలే ఉన్నాయి. కానీ ఆ ఉన్న సమయంలోనే ఇవన్నీ చక్కబెట్టేస్తుంటారు. ఇంత వయసులో కూడా యువకుల కంటే చురుకుగా ఉండగలుగుతున్నారు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన పెంచుకుంటూ పాలనలో అమలుచేస్తున్నారంటే మామూలు విషయం కాదు.
కనుక ఆయనని శత్రువుగా భావించే రాజకీయ నాయకులకు కూడా ఆయన పనితీరు, టైమ్ సెన్స్, ప్లానింగ్, ఆరోగ్యం, రాజకీయాలు, పాలనా విధానం ప్రతీదీ ఓ ‘కేస్ స్టడీగా తీసుకోవచ్చు.
కానీ తెలంగాణలో తనకు ఎదురేలేదని విర్రవీగిన కేసీఆర్ ఒక్క ఓటమితో ఫామ్‌హౌస్‌లో బందీగా ఉండిపోగా, ఒక్క ఛాన్స్‌తో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన జగన్ ఒకే ఒక్క ఓటమితో పాతాళంలోకి పడిపోయి తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు!
గమ్మత్తైన విషయం ఏమిటంటే, సిఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ తప్పిదాలు-పర్యావసనాల గురించి పార్టీ నేతలకు వివరించి, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నానని, మళ్ళీ అటువంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తగా ఉంటున్నానని నిసంకోచంగా చెపుతూ, పార్టీలో అందరూ ఏవిదంగా నడుచుకోవాలో మార్గదర్శనం చేస్తుంటారు.
కానీ ఎన్నికలలో ఓడిపోయి పదవీ, అధికారం కోల్పోయినా జగన్ ధోరణిలో ఎటువంటి మార్పు కనపడదు. ఆత్మ విమర్శ చేసుకోకపోగా పార్టీ శ్రేణులను తప్పు దోవలో నడిపిస్తుంటారు. పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలో వైసీపీ శ్రేణుల ప్రవర్తనే ఇందుకు చక్కటి నిదర్శనం.
ఓ పక్క చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులు చేస్తూ, జగన్ కంటే మంచి సంక్షేమ పధకాలు అమలు చేస్తూ, ప్రధాని మోడీతో సంబంధాలు మరింత బలపరుచుకుంటూ దూసుకుపోతుంటే, అవన్నీ వైసీపీకి ప్రమాద ఘంటికలని జగన్ గుర్తించకపోవడం అహంభావం వల్లనే.
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు పరామర్శ రాజకీయాలతో ముందుకు సాగిపోతూ, ఇదే సరైన రాజకీయ విధానమనే పార్టీలో అందరినీ భ్రమింపజేస్తున్నారు.
కానీ ప్రతీరోజూ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళకు వెళ్ళివస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలని చూస్తున్నప్పుడు జగన్ విధానం సరి కాదని స్పష్టమవుతోంది..కదా?
కానీ జగన్ ఇలాగే ముందుకు సాగుదామనుకుంటే కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా టీడీపీకి, సిఎం చంద్రబాబు నాయుడుకి ఎంతో మేలు చేసిన వారవుతారు!