చంద్రబాబు ఇంటిని ముంచడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందా?

Jagan's 75% Jobs Rule to Backfire on AP Youth?ఈరోజు ఉదయం సాక్షి మరియు తెరాస ను సమర్ధించే కొన్ని మీడియా చానెల్స్ లో … వరద ముంపులో చంద్రబాబు కరకట్ట నివాసం అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల ప్రకారం కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉందని, దీంతో చంద్రబాబు సిబ్బంది నివాసంలోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు వేస్తున్నారని, వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారని చెప్పుకొచ్చారు.

అయితే తెలుగుదేశం వర్గాలు దీనిని తీవ్రంగా ఖండించాయి. ఇప్పటివరకు అటువండిది ఏమీ జరగలేదని చెప్పుకొచ్చాయి. అంతే కాకుండా చంద్రబాబు ఇల్లు మునిగితే, తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరువస్తుందని ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించాయి. వివరాల్లోకి వెళ్తే … కృష్ణా నది వరద తాకిడి ఎక్కువ అవుతున్నా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందట. అయితే కేంద్ర జలశక్తి శాఖ కలుగజేసుకుని గేట్లు ఎత్తేలా చేసిందట.

ADVERTISEMENT

“కావాలనే గేట్లు ఎత్తకుండా చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురుచూశారు. కానీ, ఇంకా మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ను కూడా టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జలశక్తి శాఖనుండి బారేజ్ గేట్లు వదలనందుకు అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వనికి?,” అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటో ఇరుపక్షాల వారికే తెలియాలి. ఇది ఇలా ఉండగా వరద ముప్పు వల్ల చంద్రబాబు తక్షణమే ఉండవల్లిలోని నివాసాన్ని ఖాళీచేస్తే బాగుంటుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మరోసారి చంద్రబాబుకు హితబోధ చేశారు.

ADVERTISEMENT
Latest Stories