ఏటీఎం సెగ చవిచూసిన సినీ సెలబ్రిటీ!

chinmayi-sripaada-and-rahul-ravindran-given-20-rupees-by-atm-guard-notes-banప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీ సంక్షోభం సెగ అందరికీ తగులుతోంది. అయితే ఒకరికి ముందు… మరొకరికి కాస్త లేటు… అంతే తేడా..! సామాన్యులైనా… సెలబ్రిటీలైనా… ఎవరైనా సరే… ప్రస్తుత సంక్షోభానికి గురికాక తప్పదని మరో సెలబ్రిటీ నిరూపించింది. తమకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఫేస్ బుక్ లో సవివరంగా తెలిపింది.

“మోడీ నిర్ణయం ప్రకటించినపుడు తాము యుఎస్ లో ఉన్నామని, అయితే ఇండియాకు చేరుకున్న సమయంలో తమ వద్ద అసలు ఇండియన్ కరెన్సీ లేదని, దీంతో ఏటీఎంలో కనీసం ఒక వంద రూపాయలు అయినా సరే డ్రా చేసి టీ తాగుదామని ఏటీఎం దగ్గరకు రాహుల్ వెళ్ళగా, 10 గంటల తర్వాతే ఏటీఎంలో డబ్బులు నింపుతారని, అవి కూడా రెండు గంటల లోపే అయిపోతున్నాయని వాచ్ మెన్ చెప్పడంతో, నిరుత్సాహంతో ఉన్న తమకు ఆ వాచ్ మెన్ షాక్ ఇచ్చాడనే” అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

ADVERTISEMENT

“తిరిగి వచ్చేస్తుంటే… రాహుల్ కు 20 రూపాయలు ఇచ్చి టీ తాగమంటూ ఆ వాచ్ మెన్ ఇచ్చాడని, మనలో చాలా మందికి వారి హృదయాలు సరైన స్థానంలో ఉన్నాయని” తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది చిన్మయి శ్రీపాద. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పే వ్యక్తిగా చిన్మయి గురించి అందరికీ తెలిసిందే. ఇక. వర్ధమాన హీరోగా రాణిస్తున్న ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవిచంద్రన్, చిన్మయికి భర్త అన్న విషయం చెప్పనవసరం లేదనుకుంటా!

ADVERTISEMENT
Latest Stories