టైటిల్ ఒక్కటే కాదు, రిలీజ్ డేట్ కూడా వచ్చింది!

Chiranjeevi 150 Movie Release Date, Chiranjeevi Khaidi No 150 Release Date, Chiranjeevi Khaidi No 150  Movie Release Date, Chiru Khaidi No 150 Release Dateమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా టైటిల్ “ఖైదీ నెంబర్ 150” అన్న విషయం ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పై భిన్న స్పందనలు వ్యక్తమైనప్పటికీ, అధికారిక సమాచారం కావడంతో మెగా అభిమానులు చిరును ‘ఖైదీ నెంబర్ 150’గా చూడడానికి ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం వారి ఆసక్తి అంతా ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన అభిమానుల అందరి చూపులు నెలకొన్నాయి. మెగాస్టార్ ఏ రేంజ్ లో కనపడతాడోనని వేచిచూస్తున్నారు.

అయితే తాజాగా “ఖైదీ నెంబర్ 150” సినిమాకు సంబంధించిన విడుదల తేదీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు సంక్రాంతి పండుగకు వస్తుందా లేదా అన్న సందేహాలను నివృత్తి పరుస్తూ, 2017 జనవరి 13వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే అభిమానులను అంతకు మించిన పండగ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

సంక్రాంతి పండగ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసి వచ్చిన విషయం తెలిసిందే. సమ్మర్ కంటే కూడా సంక్రాంతి పండగ సమయంలో విడుదలైన సినిమాలే బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. అందులోనూ 2017 సంక్రాంతికి బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా కూడా విడుదల అవుతుండడంతో, ఈ “ఖైదీ నెంబర్ 150” విడుదల తేదీ కూడా ఆసక్తికరంగా మారింది. ఏమైతేనేం… మెగాస్టార్ సినీ సమాచారంతో మెగా అభిమానులంతా ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories