“జగదేకవీరుడు”పై మెగా ఫ్యాన్స్ లో ఉత్కంఠ!

chiranjeevi-aswini-duttమెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆల్ టైం క్లాసిక్ హిట్స్ జాబితాలో ఎప్పుడూ అగ్ర స్థానంలో ఉండే సినిమాగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నిలిచిపోతుంది. ఈ సినిమాకు సీక్వెల్ ను మెగా వారసుడు రామ్ చరణ్ తేజతో తెరకెక్కించబోతున్నట్లుగా గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను నిర్మించిన అశ్వనీదత్ కూడా ఈ దిశగా ఒకసారి ప్రకటన చేసారు.

ADVERTISEMENT

అయితే, అప్పటినుండి ఇప్పటివరకు సైలెంట్ గా మారిన ఈ సినిమా సంగతులు ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి వచ్చాయి. దానికి కారణం… అశ్వనీదత్ బ్యానర్ పై “జగదేకవీరుడు” టైటిల్ రిజిస్టర్ కావడమే. ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు? అంతకుముందు ప్రచారంలో జరిగినట్లు చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా, శ్రీదేవి తనయురాలు హీరోయిన్ గా నటిస్తారా? లేక మరో మెగా హీరో ఎవరైనా నటిస్తారా? లేక మెగా కాంపౌండ్ నుండి కాక, వేరే హీరోలు నటిస్తారా? అనే ఉత్కంఠ మెగా అభిమానుల్లో నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories