మెగాస్టార్ చిరంజీవి రెండవ తనయురాలు శ్రీజ వివాహం ఈ నెల 28వ తేదీన జరగనుందనే విషయం తెలిసిందే. అయితే ఈ వివాహం జరపడానికి ‘వెన్యూ’ మాత్రం ఫిక్స్ చేయలేదట. తొలుత చెన్నై, ఆ తర్వాత బెంగళూరు… ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏ వేదికను ఇరు పక్షాలు నిర్ణయించలేదని తెలుస్తోంది.
ADVERTISEMENT
ఇటీవల శ్రీజ సోదరి, చిరు మొదటి పుత్రిక సుష్మ, ఉపాసనలు కలిసి ఉత్తరాదిన జైపూర్, ఉదయ్ పూర్ వంటి కొన్ని ప్రదేశాలు చూసినప్పటికీ, అక్కడి వేడి వాతావరణం రీత్యా వివాహ కార్యక్రమానికి అనువుగా లేదని డిసైడ్ అయినట్లుగా మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
దీంతో శ్రీజ వివాహ వేడుకను ఖరారు చేసేందుకు మెగాస్టార్ కూడా తర్జనభర్జనలు పడుతున్నారట. కేవలం ఇరుపక్షాల కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే వేడుకగా చేయాలని భావించడంతోనే హైదరాబాద్ కు దూరంగా ఈ వేడుకను జరుపుకోవాలని చిరు నిర్ణయంగా తెలుస్తోంది.
ADVERTISEMENT



