అభిమాని కష్టం అంటే చాలు కరిగిపోతారు చిరంజీవి

Chiranjeevi Coronavirus - Acharya movie shooting stoppedఅభిమానులను అబ్బురంగా చూసుకునే హీరో… మెగాస్టార్ చిరంజీవి. వారికి కష్టం వస్తే తనకు వచ్చినట్టుగా ఫీల్ అవుతారు ఆయన. తమ ఇబ్బంది చెప్పుకుంటూ ఎవరైనా తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించే మనసున్న మనిషి చిరంజీవి. తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన మెగా అభిమాని వెంటనే కోలుకోవాలంటూ ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు.

ఆ వివరాల్లోకి వెళితే .. కడపకు చెందిన సీనియర్ మెగా అభిమాని పి సురేష్ అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడు. గతంలో కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. చిరంజీవిని ప్రాణం కన్నా మిన్నగా అభిమానిస్తూ… ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు.

ADVERTISEMENT

అయితే ఈ మధ్యకాలంలో సురేష్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చిరంజీవి తెలుసుకున్నారట. సురేష్ కదిరిలో ఉంటూ .. కిత్స నిమిత్తం ప్రతి రెండ్రోజులకోసారి కదిరి నుండి కడప, తిరుపతి వెళ్తూ వస్తున్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో, ఆర్థికంగా సతమతమవుతున్న సురేష్ కు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసారట.

ఆ మొత్తాన్ని సురేష్ బ్యాంకు అకౌంట్ కు ట్రాన్సఫర్ చేయించారట. ఆచార్య షూటింగ్ కోసం తూర్పు గోదావరిలో ఉన్న చిరంజీవి ఎటువంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని కూడా చెప్పారట. చిరంజీవి ఆప్యాయతకు ఆ అభిమాని, ఆయన కుటుంబం పొంగిపోయారట.

ADVERTISEMENT
Latest Stories