దీపావళికి ‘బాస్’ దర్శనం… ఉత్కంఠలో ఫ్యాన్స్..!

chiranjeevi-khaidi-no-150-first-lookమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో తర్వాత, ‘ఖైదీ నంబర్ 150’కి సంబంధించిన అఫిషియల్ లుక్స్ ఏమీ విడుదల కాలేదు. షూటింగ్ పిక్స్ మినహా సినిమాలో మెగాస్టార్ అసలు ఏ విధంగా ఉన్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే విడుదల చేస్తున్న ఆన్ లొకేషన్ షూటింగ్ పిక్స్ ను చూసుకునే అభిమానులు పండగ చేసుకుంటున్న తరుణంలో… వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసే సమాచారం చిత్ర యూనిట్ అందించింది.

ADVERTISEMENT

ఈ నెల 29వ తేదీన శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో మెగా అభిమానుల చూపులన్నీ దీపావళి ముందు రోజుకు మళ్ళాయి. టైటిల్ పాతగా ఉన్నా, ‘ఖైదీ’ సెంటిమెంట్ రీత్యా అభిమానులు ఓటు వేయగా, తాజాగా విడుదల కానున్న ఫస్ట్ లుక్ కు ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి. ఇదే దీపావళి ప్రిన్స్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రానుండడంతో ఇరువురు అభిమానుల మధ్య మంచి ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories