తొంగి చూస్తున్న “మెగాస్టార్” అమాయకత్వం చూడాల్సిందే!

Chiranjeevi Khaidi No 150 Movie  new lookఒక నటుడిగా మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఎప్పుడూ ఇతరులకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఒక్క పౌరాణికం తప్ప, ఎలాంటి పాత్రలకైనా ఇట్టే ప్రాణం పోసే మెగాస్టార్ నటన వెండితెరపై వీక్షించి దాదాపుగా దశాబ్ద కాలం కావస్తోంది. దీంతో మెగా అభిమానులంతా ‘ఆకలితో ఉన్న పులుల్లా’ ఎదురుచూస్తున్న తరుణంలో… ఫ్యాన్స్ కు మరింత ఊరించే విధంగా, తాజాగా విడుదల అవుతోన్న “ఖైదీ నంబర్ 150” స్టిల్స్ ఉంటున్నాయి.

ADVERTISEMENT

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ నాలుగు స్టిల్స్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దర్శకుడు వినాయక్ పక్కన పేపర్ చదువుకుంటూ ఉన్న స్టిల్, కాజల్ కు ఏదో చెప్తున్నట్టుగా ఉన్న స్టిల్ తో పాటు మెగాస్టార్ కు సంబంధించిన రెండు సోలో స్టిల్స్ ను కూడా విడుదల చేసారు. చిరు సోలో ఫోటోలలో ఒకటి స్టైల్ గా నిల్చునేది కాగా, మరొకటి మెగాస్టార్ అభినయానికి అద్దం పట్టేదిగా చెప్పవచ్చు.

గోడ పక్కన నిల్చుని తొంగి చూస్తున్న మెగాస్టార్ అమాయకత్వం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళ్ళతోనే ఎలాంటి హావభావాలనైనా పలికించగల అతికొద్ది మంది నటులలో మెగాస్టార్ కూడా ఒకరన్న విషయాన్ని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే… టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోంది.

ADVERTISEMENT
Latest Stories