మెగాస్టార్ గారి రీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఆరంభమైంది. పదేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై చిరంజీవిని చూసి తరించిపోవాలని ఎదురుచూసిన అభిమానులకు ముందుగా టీజర్ రూపంలో బుల్లితెరపై సందడి దర్శనమిచ్చారు. దీంతో యూ ట్యూబ్ లో ఓపెనింగ్ రికార్డ్స్ బద్ధలయ్యాయి. కేవలం 3.5 గంటల లోపే 1 మిలియన్ క్లిక్స్ అందుకుని ఫస్ట్ డే రికార్డును బద్దలుకొట్టింది. అయితే అప్పటితో ‘ఖైదీ నంబర్ 150’ ప్రస్థానం ఆగలేదు.
వరుసగా 2… 3… 4… మిలియన్ క్లిక్స్ ను దాటుకుని, తొలి వారం ముగిసే సమయానికి ఏకంగా 5 మిలియన్ క్లిక్స్ ను అందుకుని తన స్టామినా ఏంటో ‘యూ ట్యూబ్’ ద్వారా మరోసారి నిరూపించారు చిరు. ఒక తెలుగు సినిమాకు 50 లక్షల క్లిక్స్ రావడమంటే సాధారణ విషయమేమీ కాదు… అది కూడా వారం రోజుల్లోనే..! దీంతో ధియేటిరికల్ ట్రైలర్ విడుదలయ్యే సమయానికి 10 మిలియన్ క్లిక్స్ ను అందుకుని, 1 కోటి క్లబ్ లో చేరుతుందా? లేదా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫస్ట్ వీక్ వరకు యూ ట్యూబ్ లో రికార్డులను సెట్ చేసిన “ఖైదీ నంబర్ 150,” సిల్వర్ స్క్రీన్ పై ఎంతటి రికార్డులను సాధిస్తాడో చూడాలి. ప్రస్తుత తరం హీరోలైన మహేష్, పవన్ ల రేంజ్ లోనే మెగాస్టార్ కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తారా? లేక్ అంతకుమించి సాధిస్తారో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, ఈ నెల 25వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ సినిమా ఆడియోను అంగరంగ వైభవంగా విడుదల కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.



