సోషల్ మీడియా ఎంట్రీ రోజే నిరాశపరచిన చిరంజీవి

Chiranjeevi's-First-Insta,-Heart-Winningమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఘనంగా జరిగింది. ఆయన ఈరోజు ఉగాది సందర్భంగా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్లు తెరిచారు. ఆయన సినిమాల మాదిరి గానే ఆయనకు సోషల్ మీడియా ఘనమైన వెల్కమ్ వచ్చింది. ఇప్పటివరకూ ఇంస్టాగ్రామ్ లో ఆయనకు 417,000 పై చిలుకు ఫాలోయర్స్ వచ్చారు.

అలాగే ట్విట్టర్ లో 96300 ఫాలోయర్స్ ఉన్నారు. ట్విట్టర్ లో ఆయన రెండు ట్వీట్లు ఉగాది గురించి, కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. మూడు ట్వీట్ ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ గురించి పొగడ్తలతో నింపేశారు. ఇంస్టాగ్రామ్ లో తన మొట్టమొదటి పోస్టుగా ఆయన మాతృమూర్తి అంజనా దేవితో ఉన్న ఫోటో పెట్టారు.

ADVERTISEMENT

ఆ తరువాత అదే ఫోటో ట్విట్టర్ లో కూడా పెట్టారు. అయితే ఇంస్టాగ్రామ్ లో ఆయన తన మొట్టమొదటి పోస్టుగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది సందర్భంగా పోస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనితో మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు అయితే చివరికి అటువంటిది ఏమీ జరగకపోవడంతో నిరాశ చెందారు.

ఇకపోతే చిరంజీవికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రిటీల నుండి కూడా స్వాగతం లాభించింది. ఇది ఇలా ఉండగా…. ఆచార్య షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సమయంలో చాలా ఉండటంతో ఈ బ్రేక్ వల్ల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం లేదనే అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories