మెగాస్టార్ చిరంజీవి గారి వయసెంత?

Chiranjeevi young lookఅవును… టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ను ఒంటిచేత్తో ఏలిన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రస్తుత వయసెంత? ‘60 ప్లస్’లోకి ప్రవేశించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పై ఫోటోలో కనపడుతున్న చిరంజీవి వయసెంత? అంటే… బహుశా మెగాస్టార్ గురించి తెలియని వారయితే ఏ 40 ప్లస్ లోనో, మహా అయితే 50కి దగ్గరో ఉందని చెప్పడం ఖాయం, ఆ వయసులో ఈ ఫోటో తీసి ఉండవచ్చు అన్న అభిప్రాయం కలగడం సహజం.

అవును… తన వయసు తెలియనంతగా మెగాస్టార్ మారిపోయారు అని చెప్పడానికి ఈ ఫోటోనే ఉదాహరణ. సినిమాలంటే చిరంజీవికి ఎంత పిచ్చో అన్న విషయం అభిమానులకు తెలిసిన విషయమే గానీ, మరీ ఓ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే విధంగా కనపడతారన్నది మాత్రం ఊహించని పరిణామమే. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో… ప్రీ లుక్ కోసం నిర్వహించిన ఫోటోషూట్ లోని ఫోటో ఇది.

ADVERTISEMENT

అభిమానుల కోసం తాజాగా సోషల్ మీడియా వేదికగా నాటి ఫోటోలను విడుదల చేయగా, అందులో ఈ ఫోటో ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తోంది. సింపుల్ టీ షర్టు, గాగుల్స్ పెట్టుకుని ఉన్న మెగాస్టార్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారని చెప్పడంలో సందేహం లేదు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా ఈ ఫోటోలు సందడి చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories