ఉపాసన అందిస్తున్న ‘చిరు’ ఫిల్టర్‌ కాఫీ

Chiru Filter coffee in Apollo Foundationహీరో, హీరోయిన్ల పేర్లతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు హోటల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని హోటళ్లు ఏకంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తరాల పేరులే పెట్టేస్తారు వారి హోటళ్లకు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి పేరిట ఓ రుచికరమైన ఫిల్టర్‌ కాఫీ వచ్చేసింది. అది పెట్టింది ఎవరో కాదు స్వయంగా ఆయన కోడలు ఉపాసననే.

ADVERTISEMENT

ఉపాసనకు చెందిన ‘అపోలో ఫౌండేషన్‌’ తరఫున ఈ కాఫీ షాప్‌ను ప్రారంభించనున్నారు. ‘కేఫ్‌’ పేరిట జూబ్లీహిల్స్‌లోని అపోలో ఎఫ్‌ఎన్‌డీ థియేటర్‌ వద్ద ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ షాప్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ‘హే.. ఈ కేఫ్‌కి వచ్చి రిలాక్స్‌ అవ్వండి’ అని ట్వీట్‌ చేసారు.

ఈ కేఫ్‌లో చిరుస్‌ ఫిల్టర్‌ కాఫీ, హైదరాబాదీ కేసర్‌ రోస్‌ టీ, లుఖ్మి చికెన్‌, లామకాన్‌ వరల్డ్‌ ఫేమస్‌ సమోసా మిర్చి బజ్జీ అమ్ముతున్నారట. ఈరకంగా మామగారి మీద గౌరవం ఉపాసన చూపిస్తుందన్నమాట. కింది చిత్రంలో ఉపాసన పోస్ట్ చేసిన కేఫ్ మెనూ కూడా చూడవచ్చు.

Chiru Filter coffee in Apollo Foundation

ADVERTISEMENT
Latest Stories