బాలయ్య బాబే నాకు స్ఫూర్తి!

Comedian Ballireddy Prudhviraj Imitates Balakrishna‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ నందమూరి నటసింహం బాలకృష్ణను ఏ విధంగా అనుకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక రకంగా ఆ ఇమిటేషనే పృధ్వీకి మంచి పేరును తీసుకువచ్చింది. అయితే బాలయ్యను ఒక్క నటనలోనే కాదు, మరొక విషయంలో కూడా అనుకరిస్తానని తాజాగా చెప్పుకొచ్చాడు పృధ్వీ. తన సీన్ షూటింగ్ ఉన్నా లేకపోయినా, సెట్స్ లోనే ఉంటాను తప్ప, కార్ వాన్ లో కూడా కూర్చోను. దానికి స్ఫూర్తి బాలకృష్ణ గారే.

బాలకృష్ణ గారు మేకప్ వేసుకుని టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు. కార్ వాన్ లో కూర్చుంటే జైలు లాగా ఉంటుంది. బయట కూర్చుంటే అందరితో సరదాగా ఉండొచ్చు. వాళ్లతో మాట్లాడొచ్చు అని బాలయ్య బాబు చెప్పిన వ్యాఖ్యలే తనకు స్ఫూర్తి అని, వాటినే నేను ఇప్పటికీ పాటిస్తున్నాను అని చెప్పుకొచ్చారు పృధ్వీ. అలాగే నేను షూటింగ్ కు వెళ్లేటప్పుడు నా ఆహారం నేనే తీసుకువెళతాను.

ADVERTISEMENT

పొద్దున్నే ఐదు గంటలకే నిద్ర లేచి పూజ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన ఆహారం నేనే తయారు చేసుకుని తీసుకెళ్తాను, ఆరోగ్య పరంగా బాగుంటుంది, యూనిట్ లో కూడా మంచి రిమార్క్ ఉంటుందని అన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తూ… కమెడియన్ గా బాగా బిజీగా మారిన పృధ్వీ, ప్రస్తుతం ఓ మూడు సినిమాలలో హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి “మీలో ఎవరు కోటీశ్వరుడు” విడుదలకు సిద్ధమైంది. ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే సదరు సంగతులను చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories