‘నెవర్ బిఫోర్’ అనే విధంగా ‘మహేష్ బాబు’ మూవీ!

Comedian Priyadarshi tweet on Mahesh Babu Movieమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా అప్ డేట్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఒక్క షూటింగ్ షెడ్యూల్స్ మినహా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో, ఈ సినిమాలో నటిస్తోన్న నటీనటులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది. ఇలాంటి ప్రశ్నలనే ఎదుర్కొన్న ‘పెళ్లిచూపులు’ కమెడియన్ ప్రియదర్శి సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

“ఈ సినిమాకు సంబంధించిన సమాచారం మీకు అందించి మిమ్మల్ని సంతోషపరచాలనే తనకు ఉందని, అయితే తన బాధ్యత నిర్వహణలో భాగంగా సినిమాకు సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచాలని, నిజానికి కొన్నిసార్లు మీరు అడుగుతున్న సమాచారం తనకు తెలియదని, కానీ ‘నెవర్ బిఫోర్’ అనే విధంగా ఈ సినిమాను తయారు చేస్తున్నామని, మీరు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను” అంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు సమాచారం ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories