ఒకప్పుడు కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆ తరువాత కొంత కాలం హీరోగా మెరిశాడు. అయితే క్రమేపి ఆ మార్కెట్ తగ్గిపోవడంతో మళ్ళీ కామెడీ పాత్రల కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా పెద్దగా ఏం కాదు అనే చెప్పుకోవాలి. దీనితో ఇప్పుడు ఆయన విలన్ గా అవతారం ఎత్తబోతున్నాడట.
ఈ ఏడాది సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్టతో హిట్ కొట్టిన సాయి రాజేష్ కలర్ ఫోటో అనే సినిమాను నిర్మిస్తున్నారు. దీనిలో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ సరికొత్త ప్రయోగంతో నైనా సునీల్ కేరీర్ చక్కపడుతుందేమో చూడాలి.
సాయి రాజేష్ కథని అందించగా, మసాలా సందీప్ స్క్రిప్ట్ ఇస్తున్నాడు. ఆయన ఈ సినిమా తో మసాలా సందీప్ దర్శకుడి అవతారం ఎత్తనున్నాడు. ఇటీవలే మత్తు వదలరా తో సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తిన కీరవాణి కుమారుడు, కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యింది. గతంలో సాయి రాజేష్ సినిమాలైన హృదయ కాలేయం, కొబ్బరి మట్టలాగా ఈ సినిమా కూడా ప్రేక్షకులలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.





